లోక్ పాల్ డిమాండ్ తో జనాల్లోకి దూసుకొచ్చి, అవినీతి వ్యతిరేక పోరాటంతో శతకోటి భారతీయుల్లో హీరోగా ఎదిగిన సామాజిక కార్యకర్త అన్నా హాజారే తన బృందం రూపంలో రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. బహుశా రాజకీయ పార్టీ రూపంలో అన్నా హజారే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్నా హజారే రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. నిజాయితీ, నిబద్దలకు నిలువెత్తు రూపమైన అన్నా హజారే ఓట్ల రూపంలో భారతీయుల మన్ననలు అందుకొంటాడా? నిన్నా మొన్న ఫేస్ బుక్ లలోనూ, ట్విటర్లలోనూ, బ్లాగుల ద్వారా అన్నాకు జై కొట్టిన సిటిబర్డ్స్, అన్నా విషయాలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్న గ్రామీణులు అన్నాకు అండగా నిలుస్తారా?
ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే వెనుక బిజెపి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. హజారే రాజకీయ లబ్ది కోసమే రాజకీయ పార్టీ పెడతామని అంటున్నారని ఆయన అన్నారు.అవినీతికి వ్యతరేకంగా కాంగ్రెస్ పార్టీనే స్పందిస్తోందని, పలువురిని జైలుకు కూడా పంపిందని ఆయన అన్నారు.బిజెపి అధికారంలోకి రావడం కోసం అన్నా హజారేని వాడుకుంటోందని కూడా ఆయన అన్నారు. అన్నా హజారే బృందం వ్యవహారంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. అన్నా బృందం వల్ల కాంగ్రెస్ పై అవినీతి ముద్ర బలంగా పడుతోందని వారు భయపడుతున్నారు. దానికి తోడు హర్యానాలో జరిగిన ఒక ఉప ఎన్నికలో హజారే పర్యటిస్తే దాని ప్రభావం పడింది.అందువల్లనే ఇప్పటినుంచే అన్నా హజారేని కూడా రాజకీయంగా గందరగోళం చేసే పనిలో కాంగ్రెస్ పడింది. ఎఐసిసి మొదలు, రాష్ట్రస్థాయ కాంగ్రెస్ నాయకుల వరకు అంతా అన్నా హజారే ఉద్దేశాలను తప్పుపడుతూ మాట్లాడడం ఆరంభించడంలోని లక్ష్యం అదే అనుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం వెదకడం అంత సులభం కాదు. అలాగే అసలు అన్నా హజారే ఒక పార్టీ స్థాపిస్తే…దేశ వ్యాప్తంగా దానికి ఒక రూపం లభిస్తుందా? అన్నా హజారే నీతిమంతుడే అయినా…దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అన్నా నిర్ణయించిన క్వాలిఫికేషన్లతో అభ్యర్థులు దొరుకుతారా? ఏదో నీతిమంతుడిగా కలరింగ్ ఉన్న లోక్ సత్తా జయప్రకాశ్ ల ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే అన్నా హజారే ఫార్ములా వర్కవుటవుతుందా?
ఉదాహరణకు రాష్ట్రంలోనే తీసుకొంటే…అన్నా హజారేకు జై కొట్టని ప్రజలు, రాజకీయ నాయకులు ఉన్నారా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ లు కూడా ఆన్నాకు తమ మద్దతు ప్రకటించారు. మరి రేపొద్దున్నే అన్నా రాజకీయ పార్టీ ప్రకటిస్తే వీరిద్దరూ అన్నా పార్టీలో చేరతారా, లేక అన్నాహజారేనే తమ పార్టీలోకి ఆహ్వానిస్తారా? నాయకులను ఎందుకు ఉదాహరించాల్సి వచ్చిందంటే…ఇప్పుడు జగన్ , చంద్రబాబు నాయుడుల సమర్థకులు కూడా తమ నాయకుల స్థాయిలోనే ఆలోచిస్తారు. తమ నాయకుడిని అభిమానిస్తూనే అందరూ అన్నాకు మద్దతు పలికారు. ఇక పోలింగ్ బూత్ వరకూ నడిచొచ్చి…క్యూలోనిలబడి అన్నాహజారే అభ్యర్థులకు ఓటేసేవారి సంఖ్య ఎంత ఉంటుందో కానీ, అసలు అన్నా రాజకీయ ప్రవేశం రానున్న రెండేళ్లలో మరెన్ని మలుపులు తిరుగుతుందో!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more