పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గ్యాస్ విధానంపై మీడియా సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి?ఒకపక్క ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో ప్రధానిని కలిసి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డిపై పంచాయతీ పెట్టబోతున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపధ్యంలో బొత్స ముందుగానే హైదరాబాద్ లో దీని గురించి ఎందుకు మాట్లాడారన్నది ఆసక్తికరంగా ఉంది. బొత్స గ్యాస్ కేటాయింపులలో కేంద్ర విధానం మారాలని సూచించారు.అంతవరకు పెద్దగా ఇబ్బంది లేదు.
మహారాష్ట్రలోని డబోల్ ప్రాజెక్టు ఇప్పటిది కాదని, పి.వి.నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిందని, దానికి గ్యాస్ కేటాయింపు పాత విషయం అన్నట్లుగా మాట్లాడినట్టు అనిపించింది. అలా అని కేంద్రాన్ని సమర్ధించికపోయినా, ఒక విషయం అర్ధం అవుతుంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని విమర్శించడానికి ఆస్కారం లేకుండా మాట్లాడినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్ శిబికం ఇటీవలికాలంలో గ్యాస్ విషయంలో జైపాల్ ను విమర్శిస్తూ ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్నారు. పైగా కొంతకాలం క్రితం కిరణ్ ఈ విషయమై బహిరంగంగానే వ్యాఖ్యానించారు.అప్పట్లో అది కాస్త వివాదం అయింది.ఈ నేపధ్యంలో బొత్స సత్యనారాయణ కావాలని జైపాల్ కు మద్దతుగా , ఇందులో ఆయన తప్పులేదన్న భావాన్ని చెప్పడానికి వీలుగా మీడియాతో మాట్లాడారా అన్న అభిప్రాయం కలుగుతుంది.జైపాల్ రెడ్డి ఇంతకాలం ఆపకుంటే ఎప్పుడో గ్యాస్ వెళ్లిపోయేదని ఆయన అన్నారు. గ్యాస్ విషయంలో జరిగినదానికి తాను క్షమాపణ చెబుతున్నానని అనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఇందులో తప్పు చేసిందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు.ఏది ఏమైనా కిరణ్,బొత్స ల మధ్య అంతరం ఉందనడానికి ఇంతకన్నా వేరే చెప్పాలా?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more