తెలంగాణ ఉద్యమంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నియంత్రణ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ అనుకూలంగా నిర్ణయం వెలువరిస్తే మళ్లీ కెసిఆర్ తిరుగులేని నాయకుడు అవుతారు. లేదంటే, ఉద్యమం కెసిఆర్ చేతుల్లోంచి జారిపోయే ప్రమాదమే ఉంది. కెసిఆర్‌తో ప్రమేయం లేకుండా తెలంగాణ జెఎసి, సిపిఐ, బిజెపి, ఇతర సంఘాలు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పార్టీలు, సంఘాలు కెసిఆర్ రాజకీయ చట్రంలోకి వెళ్లకుండా అవసరమైతే కెసిఆర్‌నే తమ చట్రంలోకి తీసుకుని రావడానికి కొత్త రాజకీయ కూటమి ప్రయత్నాలు చేస్తుంది. కెసిఆర్ ఆధిపత్యానికి గండి కట్టి బహు నాయకత్వ పరిధిలోకి తెలంగాణ ఉద్యమం వెళ్తున్నట్లు కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువరిస్తే తెరాస ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు అన్ని పార్టీల్లో ఒక్కటిగా మారే అవకాశం ఉంది. ఇంతకాలం తెలంగాణ రాజకీయాలను, ఉద్యమాలను కెసిఆర్ శాసిస్తూ వస్తున్నారు. అదే ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానివల్ల కెసిఆర్ మాత్రమే కాకుండా కాంగ్రెసు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెసులోని కొంత మంది నాయకులు, సిపిఐ ఒక ఉమ్మడి అవగాహనతో ముందుకు వచ్చే సూచనలు కనిపించడమే కెసిఆర్ ముందున్న ప్రమాదం.కాంగ్రెసు అధిష్టానం కెసిఆర్‌ను తమ పార్టీలోకి తెరాస విలీనం ద్వారా తీసుకుంటే అదంతా కాంగ్రెసుకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తప్పనిసరిగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. 2014లో తమను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనే వంటి హామీలు కూడా ఏ మాత్రం పనిచేసే అవకాశాలు లేవు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని దానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తేనే అది సాధ్యమవుతుంది.లేదంటే, కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కుంటున్న కెసిఆర్ పునాదులు కదిలే అవకాశాలున్నాయి. అదే సమయంలో కాంగ్రెసు రెంటికి చెడ్డ రేవడిగా మారవచ్చు. అందుకే, కాంగ్రెసు అధిష్టానం కెసిఆర్‌తో చర్చలు జరపడానికి ముందుకు వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more