వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుకరించటం అంటే.? జగన్ లాగా బెంగుళూరులో ఒక ఫ్యాలెస్ , బంజరాహిల్స్ లో ఉన్న లోటస్ పాండ్ హౌస్ , లక్షల కోట్లు ఎలా సంపాదించాలి అనే వాటిని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుకరిస్తున్నారనుకుంటే పోరపాటు చేసినట్లే, ముఖ్యమంత్రి కిరణ్ వీటిని అనుకరించటంలేదట. కానీ జగన్ ను మాత్రం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫాలో అవుతున్నట్లు కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఎలా అంటే ఇటీవల జగన్ మార్గంలోనే ముఖ్యమంత్రి నడటానికి చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినట్లు సమాచారం. జగన్ కు మీడియా ఉన్నట్లే, ఒక మీడియాను, ఒక న్యూస్ పేపర్ ను సాధించటంలో ముఖ్యమంత్రి విజయం సాధించారు. జగన్ కు సాక్షి మీడియా, సాక్షి పేపర్ ఉన్న విషయం తెలిసిందే. జగన్ మీడియాలో సూర్యోదయం కాక ముందు నుంచే ... మొదలై.. సూర్యుడు అస్తమించిన సరే జగన్ ను గురించి, ఆయన కుటుంబం గురించి పదే పదే అలుపెరగని భజన చేస్తునే ఉంటారు, నిజాన్ని పక్కన నెట్టి, కల్పితాన్ని నిజం చేయటానికి సాక్షి మీడియాలో చాలా ప్రయత్నాలు చేస్తుంటారని కాంగ్రెస్ నాయకులు కొంత మంది గాంధీ భవన్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కి ఒక మీడియ ఉండటం ఒక ష్యాషన్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి , ఈనాడు , ఈటీవీ, ఆంద్రజ్యోతి, సూర్య, ఏబీఎన్, స్టూడియో ఎన్, లాంటి మీడియా సపోర్టు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గొంతుచించుకొని అరుస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ కు , నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఎలాగో సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉందని అందరికి తెలిసిందే. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో కాంగ్రెస్ కు మీడియా సపోర్టు లేదని చాలా మంది అనుకోవటం నిజమే, కానీ, ఇప్పుడు నిజం కాదని చెబుతున్నారు సీనియర్ రాజకీయ నాయకులు. ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , ఈ లోటునుకూడా భర్తీ చేశారనే పుకార్లు స్పష్టంగా వినిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సపోర్టుగా, ఏ టీవి, ఐ న్యూస్ అనే రెండు ఛానల్స్ పనిచేస్తున్నట్లు టీడీపీ నాయకులు అంటున్నారు.
ఐ న్యూస్ లో ఎక్కువ భాగం వాటా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు దక్కించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఛానల్స్ లో సీఎం కిరణ్ గురించే భజన చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు ఛానల్స్ ను ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఆన్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పథకాలు, యువకిరణాలు, రూపాయికి కిలో బియ్యం , సంక్షేమ పథకాలు గురించే చెబుతున్నట్లు రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఈ రెండు ఛానల్స్ లో ముఖ్యమంత్రి కిరణ్ గురించే తప్ప మరే ఇతర న్యూస్ రావటం లేదని తెలుగు ప్రజలు అంటున్నారు. మీడియా అనేది నిజాన్ని నిర్బయంగా చెప్పాలి గానీ, రాజకీయ పార్టీలకు తలోగ్గి, 24 గంటలు వారి భజన చేస్తూ , అబధ్దాలను నిజాలుగా చెప్పి, ప్రజల మైండ్ సెట్ ను మార్చాలనే ఉద్దేశంతో కొన్ని మీడియాలు, కొన్ని పేపర్లు పని చేస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. దీనివలన నిజం అనేది మరుగున పడిపోతుందని, అవాస్తం అనేది ప్రజల మద్యకు వెళ్లి, రాష్ట్రానికి భారీ నష్టం కలిగిస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి ఒక మీడియా ఉండే విధంగా నేటి రాజకీయ నాయకులు చూసుకుంటున్నారు. పీసీసీ బొత్స కు జీ న్యూస్ ఛానల్స్ లో వాటాలున్నాయానే పుకార్లు గతంలో వినిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రికి వి సిక్స్ అనే న్యూస్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణ లో మరో పేపర్ రాబోతుంది. ‘తెలంగాణ కలం’ అనే పేరుతో ఈ పత్రిక వస్తున్నట్లు రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. తన ఎదుగుదల కోసం జగన్ మీడియాను వాడుకున్నట్లుగా , ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మీడియాను ఉపయోగిస్తున్నట్లు రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more