రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం పై కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ బంగారు తల్లి పథకం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతు.. మగవారి సంఖ్య పెరిగిపోవటంతో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మహిళలపై ఉన్న గౌరవంతో ‘బంగారుతల్లి ’ పథకం ప్రవేశ పెట్టినట్లు కాంగ్రెస్ నాయకులు చంకలు కొట్టుకుంటూ.. సందడి చేస్తున్నారు. ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటూ, డప్పులు మోగిస్తుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అని చెప్పుకుంటూ తిరుగుతున్న జీవిత రాజశేఖర్లు ‘బంగారు తల్లి ’ కోసం రోడ్డు పడ్డారు. అంటే జీవితా రాజశేఖర్లు కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న విషయం తెలిసిందే. బంగారు తల్లి పథకం మా పిల్లలకు కూడా వర్తిస్తుందా? అని ముఖ్యమంత్రి ఆఫీసు చుట్టు తిరుగుతున్నారు. అయితే ఈ ప్రేమ జంటకు ఒక భయంకరమైన నిజం సీఎం ఆపీసు నుండి లీక్ అయ్యింది. విషయం తెలుసుకున్న జీవితా రాజశేఖర్లు ముఖ్యమంత్రిని కలవాటానికి సన్నహాలు ముమ్మరం చేసి అలసి పోయారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
బంగారుతల్లి పథకాన్ని ప్రజల్లో తీసుకువెళ్లేందుకు బంగారుతల్లి పై కొన్ని యాడ్స్ చెయటం జరిగింది. ఆ యాడ్స్ లో ఎమ్మెల్యే జయసుధ నటించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ దంపతులు జయసుధ పై మండిపడుతూ, సీఎం దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పథకాలను , (ఎయిడ్స్ నిర్మూలన) వాటిలో మేము కలిసి నటించి, కాంగ్రెస్ పార్టీకి చాలా సహాయపడ్డాం, బంగారుతల్లి పథకం యాడ్స్ కూడా మాకే ఇవ్వాలని ఈ ఇద్దరు దంపతులు సీఎంను డిమాండ్ చెయ్యటానికి సిద్దమైనట్లు సమాచారం.
అయితే ఎట్టకేలకు సీఎం దర్శనం లభించటంతో ఈ ఇద్దరు దంపతులు గంటసేపు కిరణ్ ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ ప్రేమ పక్షుల మాటలకు కిరణ్ కుమార్ రెడ్డి కి సహనం కోల్పోయి, ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారో ఖచ్చితంగా చెప్పండి? మీరు బంగారుతల్లి పథకం పై ఇలాంటి విమర్శలు చెయ్యటం మంచిది కాదు. జయసుధతోనే ఇంక కొన్ని బంగారుతల్లి పథకం పై యాడ్స్ తీశాం, మీకు ఇచ్చే ప్రసక్తి లేదని గట్టిగా ప్రేమ దంపతులకు సీఎం షాక్ ఇవ్వటంతో.. నెమ్మదిగా అక్కడ నుండి జారుకొని ఫిలింనగర్లో తెలినట్లు సమాచారం. జీవిత రాజశేఖర్లుకు ఉన్న పరువు మొత్తం పోయిందని కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more