టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కు టాలీవుడ్ మెగా స్టార్ కేంద్ర మంత్రి చిరంజీవి మద్య అంతర్గత వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు చిరంజీవి పై విమర్శలు చెయ్యటంలో దాసరిదే పై చెయ్యిగా ఉన్న విషయం తెలిసిందే. దాసరి టాలీవుడ్ లో జరిగినే ప్రతి వేడుకను తన విమర్శలకు అనుకూలంగా మలుచుకుంటారనే నిజం ప్రతిఒక్కరి తెలిసిందే. ఎక్కడ ఎలాంటి సందర్భం జరిగిన అక్కడ చిరంజీవి పై విమర్శలు చెయ్యటం దాసరికి ఒక అలవాటుగా మారిందనే టాక్ టాలీవుడ్ లో నడుస్తుంది. ఎన్నికల ముందు ఐతే చిరంజీవి ని టార్గెట్ చేస్తూ ‘మేస్త్రి’ అనే పొలిటికల్ సెటైరికల్ సినిమా కూడా తీసారు ఇప్పుడు చిరంజీవి దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యారని సమాచారం. మంత్రి చిరంజీవి నిన్న జరిగిన ఫిలిం చాంబర్ అధ్యక్షపదవి ఎన్నికలలో దాసరి వర్గానికి షాక్ ఇచ్చారు. ఇండస్ట్రీ దాసరి వర్గం చిరంజీవి వర్గాలుగా విడిపోయి ఉన్న విషయం తెలిసిందే . ఈ పరిస్థితుల్లో నిన్న జరిగిన టాలీవుడ్ ఎన్నికలలో చిరంజీవికి అత్యంత సన్నిహితుడు సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయిన ఎన్.వి.ప్రసాద్ ఫిలించాంబర్ అధ్యక్ష స్థానానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది.ఫలితాన్ని ప్రకటించకుండా రిజర్వులో ఉంచారు . ఫలితాన్ని ఇంకా అధికారకంగా ప్రకటించకపోయినా ప్రసాద్ ఎన్నిక ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. గత సంవత్సరం తమ్మారెడ్డి భరద్వాజ ఈ సంఘానికి దాసరి సహకారంతో అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.చిన్న సినిమా నిర్మాతలకు పెద్ద సినిమా నిర్మాతలకు వార్ గా జరిగే ఈ ఎన్నికలు ఎప్పుడూ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గానే ఉంటాయి. ప్రస్తుత పరిస్థుతుల తీరును బట్టి చిరంజీవి దాసరికి గట్టి షాకిచ్చాడనే టాక్ ఫిలింనగర్ వాసుల మద్య నడుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more