‘పంజా’ సినిమా రివ్యూ
నటీనటులు : పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా, అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంస్ధ : సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్.కెమెరా: పి.ఎస్.వినోద్
ఎడిటింగ్ : శ్రీకర్‌ప్రసాద్
యాక్షన్ : శామ్‌కౌశల్
సంగీతం : యవన్ శంకర్ రాజా
ఆర్ట్ : సునీల్‌బాలు
స్క్రీన్‌ప్లే : రాహుల్ కోడా
సంభాషణలు : అబ్బూరి రవి
స్టైలింగ్ : అనూవర్థన్
నిర్మాతలు : నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ
రేటింగ్ : 3.75
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పంజా’ సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా తరువాత వచ్చిన ఈ సినిమా పై అభిమానులు పెద్ద అంచనాలే పెట్టుకున్నారు. స్టైలిష్ డైరెక్టర్ గా పేరొందిన తమిళ దర్శకుడు విష్ణు వర్థన్ రూపొందించిన ఈ సినిమా అభిమానులకు తన ‘పంజా’ పవర్ చూపించాడో లేదో ఏ సారి చూద్దాం.
కథ ఏమిటని చూడకండి. సినిమాలో కధను ఎలా చెప్పారన్నది ముఖ్యం. హీరో యాక్షన్ సన్నివేశాల్లో కనిపించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. తన కుటుంబ సభ్యులను చంపినవారిమీద ప్రతీకారం తీసుకోవటం కన్నా గొప్ప కారణమింకేముంటుంది. చేరదీసి ఆదరించి మాఫియాలో చేర్చుకుని, రాబర్ట్ అనే నామకరణం కూడా చేసి, చేతికో ఆయుధాన్ని కూడా ఇచ్చిన జాకీష్రాఫ్ సాయం వలన నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్, చిన్నప్పుడే తన కుటుంబాన్ని రూపుమాపి అనాథను చేసి వదిలేసినవారిని మట్టుబెట్టటానికి పూనుకుంటాడు. అప్పటికే పోరాటాల్లో రాటుతేలిన హీరో అందుకోసం తిరిగి తన ఊరు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ తన పేరు జైదేవ్ గా మార్చుకుని స్థానిక పోలీస్ పాపారాయుడు (బ్రహ్మానందం) సాయంతో తన పని ఎలా పూర్తిచేసుకుంటాడన్నది బంగారంలా వెండి తెర మీదనే చూడొచ్చు కదూ.
ఈ సినిమా యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ గా, కామెడీగా, కోల్ కత్తా మాఫియా బ్యాక్ డ్రాప్ గా సాగుతుంది. పవన్ కళ్యాణ్ పేరు ‘జై’. హీరోయిన్ పేరు సంధ్య. మాఫియా గ్రూప్ మెంబర్ గా కనిపిస్తాడు. ఫ్యామిలీ రివేంజ్ బ్యాక్ డ్రాప్ ని కలుపుకుని కలకత్తా మాఫియా నేపధ్యంలో ఈ చిత్రం జరుగుతుంది. అయితే చిత్రం మాఫియా నేపధ్యమైనా చాలా కామిడీగా నడుస్తుంది. సెకండాఫ్ లో బ్రహ్మానందం, ఆలీ కామెడీతో పవన్ చేసే విన్యాసాలు కడుపుబ్బానవ్విస్తాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కొట్టిన ఓ డైలాగ్ కి జనం థియేటర్ లో ఎగిరిగంతేస్తున్నారు. ‘‘ నేను చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు అడగాల్సిన అవసరం లేదు భగవాన్ ’’ అని పవన్ తన స్టైల్ లో చెప్పాడు.
హైలెట్స్ ఏంటంటే... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గడ్డం సినిమాకే హైలెట్. ఇంతవరకు పవన్ ఏ సినిమాలో లేని విధంగా కనిపిస్తాడు. ఈ సినిమాకి పవన్ స్టైలిష్ ఫర్ఫామెన్స్ తోడవ్వటంతో సినిమా రక్తి కట్టించింది. బ్రహ్మనందం తో పవన్ చేసిన కామెడీ సాంగ్ బాగా ఆకట్టు కుంటుంది. ఈ పాటలో పవన్ స్టెప్పులు బాగా వేశాడు. ఈ సినిమాకి హైలెట్ గా బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, స్కీన్ ప్లే అని చెప్పవచ్చు.
తమిళంలో బిల్లా వంటి చిత్రాలను తెరకెక్కించిన విష్ణువర్థన్ ఈ సినిమాని బాగా తెరకెక్కించాడు. ఏ సన్నివేశాన్ని ఎలా చత్రీకరించాలో అలా చిత్రీకరించాడు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన స్వరాలు అందరినీ ఆకట్టు కట్టుంటున్నాయి. ఈ చిత్రంలో ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసే విధంగా నటించాడు.
ఈ కథను తన విశేష ప్రతిభను కూడగట్టుకుని దర్శకుడు విష్ణు వర్ధన్ ఆద్యంతం మంచి పట్టుతో తెరకెక్కించారు. ఈ సినిమాకథలో పగ, యాక్షన్ సన్నివేశాలు ఉండటం అవసరమే అయినా శ్రుతి మించకుండా సన్నివేశాలకు అనుగుణంగా వాడుకుంటూ, వినోదానికే పెద్ద పీట వేసారు. బ్రహ్మానందం, ఝాన్సీ, అలీలు హాస్యానికి కొదవు లేకుండా చేసారు. అంజలీ లావానియా, సారా జేన్ లు శృంగార పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. అడవి శేష్ దుష్టపాత్రకు ప్రాణం పోసారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గాల సహకారం, కృషి సినిమాను రూపుదిద్దటంలో కనపడుతోంది.
పవన్ కళ్యాణ్ గెటప్, నటన, టైమింగ్ ఎప్పటిలాగానే అద్భుతం. పవర్ స్టార్ అభిమానులను నిరాశ పరచని సినిమా ఇది. పవన్ కళ్యాన్ కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలకు ఈ సినిమా భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం ఇది.