Teluguwishesh అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది Attarintiki Daredi Movie Review, Attarintiki Daredi Review, Attarintiki Daredi Rating, Attarintiki Daredi Movie Rating, Attarintiki Daredi LIVE UPDATES, Attarintiki Daredi Telugu Movie, Star cast: Pawan Kalyan, Samantha, Pranitha, Producer: BVSN Prasad, Director: Trivikram Srinivas, Cast and Crew on teluguwishesh.com. Product #: 46965 4/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అత్తారింటికి దారేది

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

  • దర్శకుడు  :

    త్రివిక్రమ్

  • నిర్మాత  :

    బి.వి.ఎస్.ఎస్ ప్రసాద్

  • సంగీతం  :

    దేవీ శ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    4/54/54/54/5  4/5

  • ఛాయాగ్రహణం  :

    ప్రసాద్ మూరెళ్ళ

  • ఎడిటర్  :

    -

  • నటినటులు  :

    పవన్ కళ్యాణ్, సమంతా, ప్రణీత, నదియా, ఆలీ తదితరులు

Attarintiki Daredi Movie Review

విడుదల తేది :

సెప్టెంబర్ 27 2013

Cinema Story

బోమన్ ఇరానీ (రఘునందన్) ఇటలీలో బాగా ఉన్నవాడు. అతని కూతురు నదియా (సునంద) ప్రేమించి రావురమేష్ ని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. రఘనందన్ మనవడు గౌతమ్ నంద (పవన్ కళ్యాణ్ ) . ఇతను తన తాతతో పాటు ఇటీలోనే ఉండి అక్కడ తన తాత వ్యాపారాలు చూసుకుంటాడు. అన్నీ ఉన్నా రఘనందన్ కి కూతురు లేని ఉంటుంది. మీ మేనత్తను నా దగ్గరికి తీసుకొస్తావా అని కోరడంతో ఇండియా కు వచ్చి, తన అత్త ఇంట్లో డ్రైవర్ గా చేరి, అక్కడ ఉన్న తన మరదళ్ళు అయిన ప్రణీతను ప్రేమించి, ఆ కుటుంబానికి ఉన్న కష్టాల్ని తీర్చుతూ చివరికి మేనత్త మనసు మార్చి సమంతను ఎలా పెళ్లి చేసుంటాడు అనేది తెర పైనే చూడాల్సిందే.

cinima-reviews
అత్తారింటికి దారేది

టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఉన్న మాస్ , క్లాస్ రేంజ్ అంతా ఇంతా కాదు.  ఆయన సినిమా అంటేనే అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం. అలాంటి ఆయనతో ఓ క్రేజీ దర్శకుడి సినిమా అంటే అభిమానుల్లో ఏర్పడే అంచనాలు అన్నీ ఇన్ని కావు. ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో బ్రహ్మానందం పవర్ స్టార్ కటౌట్ పెట్టుకొని వచ్చి తన పని పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. నిజంగానే ఆయనకు అంత పవర్ ఉంది టాలీవుడ్ లో. ప్రతి సినిమాకో కొత్త స్టైల్ ని, ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసే పవన్ ని ప్యామిలీ చిత్రాల దర్శకుడు, రచయిత అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్యామిలీ డ్రామాలో నటింపజేశాడు.  ఆయన్ను ఇలాంటి కథకు ఒప్పుకున్నాడంటే త్రివిక్రమ్ మీద ఎంత నమ్మకం ఉందో వేరో చెప్పాల్సిన పనిలేదు. సాధారణమైన స్టోరీని కూడా తనకున్న ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కించే త్రివిక్రమ్ పవన్ ని ఈ సినిమాలో కొత్తగా, విభిన్న కోణాల్లో చూపించి అత్తారింట్లో సందడి చేయించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఫ్యామిలీ డ్రామను ఆడించడంలో త్రివిక్రమ్, నటించడంతో పవన్ ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకున్నాడో ఈ చిత్ర రివ్యూ ద్వారా చూద్దాం.

దర్శకుడు త్రివిక్రమ్ ఎంచుకున్న కథ కొత్తదిగా లేక పోయినా, తాను పవన్ కోసం రాసుకున్న కథకు తన మార్కు డైలాగులను, పవన్ మేనరిజానికి తగ్గట్లు తెరకించాడు. ఈ కథ దర్శకుడు పవన్ చుట్టే తిరిగేలా రాసుకున్నాడనిపిస్తుంది. అలానే తెరకెక్కించాడు కూడా. ప్రతి సన్నివేశానికి తన పంచ్ డైలాగులను అల్లుకుంటూ ఎప్పుడు కొత్త ఆలోచన వస్తే దాన్నే తెరకెక్కించాడు. సాధార‌ణ‌మైన స‌న్నివేశాన్నికూడా తన టేకింగ్ వాల్యూస్‌ తో మెరుగైన అవుట్ పుట్ వ‌చ్చేలా జాగ్రత్త ప‌డ్డాడు. పంచ్‌ లు భ‌లే ప‌డ్డాయి. కాక‌పోతే ప్రాస‌ల హ‌డావుడి ఎక్కువైంది. అందులో ద్వందార్థాలు బాగా దొర్లాయి. దీంతో సదరు ప్రేక్షకుడి ఇది త్రివిక్రమ్ సినిమానా లేక శీనువైట్ల సినిమానా అనే ఫీలింగు కలిగేలా చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ని మాస్ నుండి ఫ్యామిలీ హీరోగా చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ ను శ్రద్దగా నడిపించి, సెకండాప్ ను వదిలేశాడు. కానీ క్లైమాక్స్ సీన్ తో మళ్లీ ప్రేక్షకుల్ని తన దార్లోకి తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద మైనస్ లు ఏమీ లేవు. అక్కడక్కడా ఉన్నా అవి పవన్ పై అభిమానులు చూపించే ప్రేమ ముందు కొట్టుకుపోతాయి. పైరసీ ద్వారా లీకైనా సినిమాలో కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ ఉంది కాబట్టి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది.

Cinema Review

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ వన్ మ్యాన్ షో లాగా ఉంటాయి. కానీ ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ అతనికి ఎక్కవ ఇంపార్టెన్స్ ఇచ్చి, పవన్ మేనరిజంతో కథను ముందుకు నడిపించినా ప్రతి సీన్ లో పవర్ పాటు పంచ్ ఉండేలా చూసుకోవడంతో ఆద్యంతం రక్తికట్టించింది. ఎప్పుడు హీరోయిజం ప్రదర్శించే పవన్ ఇందులో డ్రైవర్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఫ్యామిలీ సెంటిమెంటులో ఉండే చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్ ని బాగా క్యారీ చేశాడు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులను పవన్ తనదైన శైలిలో చెప్పి ప్రేక్షకులన్ని ఆకట్టుకుంటాడు. గత సినిమాలోతో పోలిస్తే పవన్ ఇందులో చాలా క్యూట్ గా అందంగా కనిపించాడు. ఇక ఈ సినిమాలో నటించిన సమంతా, ప్రణీతల పాత్రలకు సమ న్యాయం దక్కింది. ఫస్టాఫ్ లో ప్రణీత ఎక్కువ కనిపిస్తే, సెకండాఫ్ సమంతా ఎక్కువగా కనిపించింది. వీరిద్దరు కూడా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. పవన్ కి అత్తగా నటించిన నదియాకే ఎక్కువ రోల్ దక్కింది. అత్త పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక పవన్ కి తాతగా, నదియాకు తండ్రిగా నటించిన బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తన పరిధి మేరకే నటించాడు. ఇక పవన్ సినిమాలో రెగ్యులర్ గా కనిపించే ఆలీ, బ్రహ్మానందంలు కామెడీ బాగా చేసి పంచ్ లు పడిపించుకున్నారు. ఎమ్మెస్ నారాయణ ఫస్టాఫ్ లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. ఇక పోసాని, రావు రమేష్ లు తన పాత్రల మేరకు నటించి ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం : ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ముగ్గురు ప్రసాద్ ల గురించి. దేవీ శ్రీ ప్రసాద్, ప్రసాద్ మూరెళ్ళ, , బీవీఎన్ఎస్ ప్రసాద్. దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతం తో ఆకట్టుకుంటే, సినిమాటోగ్రఫ్రీలో ప్రసాద్ పనితనం, క్వాలిటీలో నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్. దేవీ శ్రీ పవన్ సినిమా అంటే మనస్సు పెట్టి పనిచేస్తాడేమో అనిపించేంతగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్. ముఖ్యంగా ‘ఆరడుగల బుల్లెట్ ’ పాట చిత్రీకరణ తగ్గట్లు సంగీతం అందించి అలరించాడు. ఖుషి తరువాత ఈ సినిమాలో పవన్ చాలా అందంగా కనిపించాడంటే కారణం సినిమాటో గ్రఫీ. ప్రసాద్ మూరెళ్ల తన కెమెరా పనితనాన్ని మరోసారి నిరూపించాడు. ప్రతి ఫ్రేమ్ ని చాలా చక్కగా బంధించాడు. నిర్మాణ విలువల విషయానికి వస్తే నిర్మాత ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎందుకంటే పవన్ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు కాబట్టి. ఎడిటింగ్ విభాగం కూడా చాలా చక్కగా ఉండటంతో సినిమా అన్ని విధాలుగా బాగా వచ్చింది. ఇందులో త్రివిక్రమ్ పంచ్ డైలాగులు అన్నింటికన్నా హైలెట్.

chivaraga

 అత్తారిల్లు అంతా ‘పవన్ ’ మయం

more