టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అయిపోదామని ఇండస్ట్రీలో శ్రద్ధగా అడుగుపెట్టిన హీరోయిన్ శ్రద్దాదాస్. ఈమె కెరియర్ ప్రారంభం నుండి పాత్ర పై కాకుండా అందాలు ఆరబోయడం పై శ్రద్ధ పెట్టింది. ఈమె ఎంత శ్రద్ధ పెట్టి అందాలు ఆరబోసినా ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం', 'ఆర్య 2', వంటి చిత్రాలు మాత్రమే ఆమెకు గుర్తింపునిచ్చాయి కానీ ఆమెను మెయిన్ హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి.
ప్రస్తుతం ఆమె వైవియస్ చౌదిరి దర్శకత్వంలో రూపొందుతున్న రేయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రలో చేస్తోంది. ఆ సినిమాలో ఆమె చాలా హాట్ గా కనపడనుందని ప్రచారం జరుగుతోంది. కెరీర్ ప్రారంభం నుంచి మెయిన్ హీరోయిన్ కావాలనుకున్న తన కోరిక తీరకపోగా ఇప్పుడు వస్తున్న సెకండ్ హీరోయిన్ లాంటి వేషాలకు కూడా ముప్పువచ్చే పరిస్థితి ని ఆ మధ్య విడుదలైన 'ముగ్గురు'తెచ్చిపెట్టింది.మరో ప్రక్క వరుణ్ సందేశ్ హ్యాండ్ ఇవ్వటం కూడా ఆమెను బాధల్లో పడేసింది.తను నటించి సినిమాలు గురించి చెప్పాలంటే వరసగా ప్లాప్ సినిమాల లిస్ట్ చదివినట్లు అవుతోందని ఆమె వాపోతోంది. 'టార్గెట్' మొదలుకుని 'అధినేత' వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించింది.
టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిన భామలందరూ పెళ్ళి చేసుకుంటున్నారు కదా.... మీరు కూడా చేసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు... ఈ భామ ట్విట్టర్ లో పదేళ్ల దాకా పెళ్లి మాటత్తే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. మరో పదేళ్ల వరకూ నా పెళ్లి గొడవ ఎత్తద్దు. అప్పటివరకూ నేనూ పెళ్లే చేసుకోను. నేను ప్రస్తుతం నా వృత్తినే పెళ్లి చేసుకున్నా. దానికి న్యాయం చెయ్యనియ్యండి. నా కోరికలు,నా గోల్స్ అన్నీ ఒకదాని దాని తర్వాత మరొకటి తీర్చుకోనివ్వండి. ఆ తర్వాత పెళ్లి విషయం తీరిగ్గా ఆలోచిద్దాం అని ఘాటుగా చెప్తూ ట్వీట్ చేసింది. ఇక తెలుగులో కేవవం సెకెండ్ హీరోయిన్స్ రోల్స్,అదీ హాట్ గా ఉండే క్యారెక్టర్సే కెరీర్ ప్రారంభం నుండీ పరిమితమైన ఆమె తనూ మెయిన్ హీరోయిన్ చేసే అవకాశం వస్తే నిరూపించుకుంటాను అంటోంది. అంటే ఈ భామ కోరికలు మరో పదేళ్ళు అయితే గానీ తీరయని అంటున్నారు సినీ జనాలు. మరి ఈమె కోరికలు అన్నీ తీరిన తరువాత చేసుకున్న వాడి కోర్కెల సంగతో... ? అని ఆమెకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more