రాజకీయ చరిత్రలో ఒక సంచలనం స్రుష్టించిన పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. అతి కొద్ది రోజుల్లోనే.. జాతీయ స్థాయిలో రాజకీయ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు సంపాదించుకున్నారు. గడిచిన 67 సంవత్సరాల ఏ రాజకీయ పార్టీకి రాని గుర్తింపు.. ఒక్క ‘‘జనసేన పార్టీకి ’’ వచ్చింది. ప్రజల నుండి, ప్రజా నాయకుల నుండి విశేష స్పందన జనసేనా పార్టీకి లభించింది. దీంతో లోకల్ , జాతీయ రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది.
అయితే ‘‘జనసేన పార్టీ ’’ జరుగుతున్న ఎన్నికల సమరంలో లేకపోయినప్పటికి.. ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం కొత్త నీరుతో.. రాజకీయ పక్షళానం చేయటమే. అయితే ఇప్పుడు జనసేన పార్టీలొకి పవన్ కళ్యాణ్ మాజీ (రెండవ) భార్య రేణుదేశాయ్ చేరుతున్నట్లు టాలీవుడ్ పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు పవన్ తో కలిసి రాజకీయ సాన్నిహిత్యాన్ని కోరుతోందని టాక్. ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న రేణు భవిష్యత్‌లో రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఆమె మోడీని కలిసే అవకాశం ఉందంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం...ఆ వెంటనే బీజేపీకి మద్దతు పలకవడంతో తన మాజీ భర్తపై రేణు దేశాయ్ కన్నుపడిందని అంటున్నారు. రీసెంట్ గా రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ పై పొగడత్తల వర్షం కురిపించింది.
దీంతో రేణు దేశాయ్ జనసేన పార్టీలో చేరుతుందనే పుకార్లు టాలీవుడ్ లో చకర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ అందరు వాడుకుంటున్నారని పవన్ అభిమానులు మండిపడుతన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను కొంతమంది పని కట్టుకొని బయటపెడుతున్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలాంటి పుకర్లకు పవన్ త్వరలో చెక్ పెడతారని .. ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more