ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుందని, ఆ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని, నాగార్జున, మహేష్ బాబు, ఐశ్వర్య రాయ్, శృతిహాసన్ లు కలిసి నటించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేసే విధంగా మణిరత్నం భార్య సుహాసిని కూడా అధికారికంగా తెలియజేసింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆపేసారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం టాలీవుడ్ లెక్కల దర్శకుడే కారణమని తెలుగు, తమిళ ఇండస్ట్రీ గుసగుసలు పెడుతున్నాయి. ఇంతకీ ఆ లెక్కల దర్శకుడు ఎవరనే కదా మీ అనుమానం. తన ప్రతి సినిమాలో ఏదో ఒక లెక్కలు చూపించే దర్శకుడు సుకుమారే దీనికి కారణమని అంతట వినిపిస్తుంది.
సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం.... మహేష్ తో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాలని 1 నేనొక్కడినే అనే ప్రయోగాత్మక చిత్రాన్ని తీసి అట్టర్ ఫ్లాప్ అయ్యేలా చేశాడు. దాంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోగా... మహేష్ చేత ‘‘మరోసారి ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయకూడదని’’ నిర్ణయం తీసుకునే పరిస్థితి తెచ్చాడు సుకుమార్. సీన్ కట్ చేస్తే... మణిరత్నం సినిమా కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమేనని తెలిసింది. అందుకే మహేష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పకున్నాడట. మహేష్ తప్పకున్నాడని నాగార్జున కూడా ఏదో ఒక సాకు చెప్పి మణిరత్నానికి హ్యండ్ ఇచ్చేసాడట. ఐశ్వర్య, శృతిలు కూడా చేసేదేమిలేక వేరే సినిమాలపై దృష్టి పెట్టారు.
ఇదిలా ఉంటే మణిరత్నం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి, మరో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడట. ఈ కొత్త మల్టీస్టారర్ సినిమాలో తెలుగు యువ టాప్ హీరోలయిన అల్లు అర్జున్, రాంచరణ్ లను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మణిరత్నం ఇటీవలే చిరంజీవి సహయంతో బన్నీ, చెర్రీలకు కథ చెప్పాడంట. కథ నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.
కానీ ప్రస్తుతం చరణ్ ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివ సినిమాలో నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. అదే విధంగా బన్నీ తాజాగా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. మరి మణిరత్నం సినిమాలో ఈ బాబులు ఎప్పుడూ చేస్తారో త్వరలోనే తెలియనుంది.
Sandy
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more