ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య చిచ్చు రావణకాష్టంలా రగులుతూనే వుంది. ఇండస్ట్రీ ఏమనుకుంటుదన్న విషయం పక్కన బెడితే.. ఇరువురు బజారున పడటంతో.. ప్రేక్షకులు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇద్దరు సిగ్గు.. ఎగ్గులతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువును బజారుకు ఈడుస్తున్నారని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సినిమాల ద్వరా ప్రేక్షకులకు వినోదాన్ని, ఒక మెసేజ్ ను అందించే వీరు.. బద్దశత్రువుల మాదిరగా గొడవ పడక పోతే.. ఒకరు కాకపోతే మరోకరు సంయమనం పాటించవచ్చు కదా అంటున్నాయి సినీవర్గాలు.
ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై స్పందించిన శ్రీనువట్ల తనకు కాదు అతనికే సిగ్గులేదని అన్నారు. ప్రిన్స్ మహేశ్‌బాబు ఆగడు సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం, ఆ చిత్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌ను తొలగించడం, ఆ తరువాత ఈ వ్యవహారం దర్శకుల సంఘం, అక్కడ నుంచి ఫిల్మ్‌చాంబర్ వరకు వెళ్లింది. ఆ తరువాత ప్రకాశ్‌రాజ్ విలేకరుల సమావేశంలో తన ఆవేదనను కవితాత్మకంగా చెప్పారు. ఆగడు సినిమాలో ప్రకాశ్‌రాజ్ స్థానంలో తీసుకున్న నటుడు సోనూసూద్‌తో శ్రీను వైట్ల ప్రకాష్రాజ్ కవితను చెప్పించారు
దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ శ్రీను వైట్లపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎవరి వల్ల తాను ఆవేదనకు గురయ్యానో అతడే, నా స్థానంలో తీసుకున్న వేరొక నటుడితో నా ఆ మాటలు(కవిత) చెప్పించడం దారుణం అన్నారు. శ్రీను వైట్లకు ఏ మాత్రం సిగ్గు, సంస్కారం ఉన్నా తనకు ఫోన్ చేసి ''మీ మాటల్ని నేను నా సినిమాలో ఉపయోగించుకుంటాను'' అని అడిగేవారన్నారు.. కనీసం వాడుకున్న తరువాతైనా ఆ మాట చెప్పేవారన్నారు. వ్యక్తిగతంగా శ్రీనుపై తకెలాంటి కోపం లేదని, అతని అహంకారం తనకు నచ్చలేదని అన్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన శ్రీను అహంకారాన్ని తగ్గించుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళతారని అన్నారు.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై శ్రీను వైట్ల మాట్లాడుతూ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు నెగెటివ్ ప్రచారం చేయడం సినిమా సక్సెస్ను అడ్డుకోవడమే అన్నారు. తాను ఎవరినీ ఉద్దేశించి సెటైర్లు వేయలేదని చెప్పారు. ఆగడు సినిమా నుంచి ప్రకాష్ రాజ్ను తప్పించడం అహంకారం కాదని, అది తన ఆత్మాభిమానం అన్నారు. సినిమా ఎలా తీయకూడదు అనేది తాను ప్రకాష్రాజ్ వద్ద నేర్చుకోవలసిన అవసరంలేదని చెప్పారు. నడుస్తున్న సినిమాపై కామెంట్లు చేయడం మంచిదికాదన్నారు. సినిమాపై బతుకుతూ సినిమాపై కామెంట్లు చేయడం సబబుకాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్తో మంచి సంబంధాలు ఉన్నట్లు శ్రీను వైట్ల తెలిపారు.
ఆగడు సినిమా విడుదలకు ముందు ప్రకాష్రాజ్ సినిమా కూడా విడుదలైందని, ఆ సినిమా ఏమైందో అందరికీ తెలుసన్నారు. దానిపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో, ఆయనపై ఎన్నిసార్లు బ్యాన్ విధించారో అందరికీ తెలుసని అన్నారు. ఇక నుంచైనా ప్రకాష్రాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవడం మంచిదని శ్రీను వైట్ల సలహా ఇచ్చారు.
శ్రీను వైట్ల తాజా విమర్శలపై ప్రకాష్రాజ్ సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించారు. తాటి చెట్టు కింద దొరికిపోయినవాడిని ఏమి చేస్తున్నావు అని అడిగితే, పాలు తాగుతున్నానని చెప్పాడట అలావుంది శ్రీనువైట్ల వ్యవహారశైలి అంటూ ప్రకాష్రాజ్ ఫేస్బుక్లో, ట్విట్టర్ లో రాశారు: అంతేకాదు ఆల్ ది బెస్ట్ ఛీర్స్.అటూ కోట్ చేశారుజ
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more