ఫస్ట్ లుక్ అంటూ పీకే పోస్టర్ విడుదలతో సంచలనం సృష్టించిన అమీర్ ఖాన్.., సెకండ్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే గతంకంటే పూర్తి డిఫరెంట్ గా సెకండ్ పోస్టర్ ఉంది. ఫస్ట్ పోస్టర్ లో బట్టల్లేకుండా ఉన్న అమీర్.., ఈ పోస్టర్ లో మాత్రం నిండుగా బట్టలేసుకున్నాడు. తొలి పోస్టర్ లో కేవలం తన శరీరానికి చిన్న టేప్ రికార్డర్ పెట్టుకున్న అమీర్.., ఆగస్టు 20న వచ్చే పోస్టర్ లో కనీసం ట్రాన్సిస్టర్ కూడా ఉండదని మరింత ఎగ్జైట్ చేశాడు. అయితే మళ్ళీ వివాదం ఎందుకనుకున్నాడో ఏమో.., ఈ సారి పూర్తి బట్టలేసుకున్న ఫొటో విడుదల చేశారు. ఈ ఫొటోతో తనపై గతంలో విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పాడు.
తొలి ఫొటోలో నగ్నంగా పోజివ్వటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి సినిమాలను ఎంకరే్ చేయవద్దని పలు సంఘాల నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి. చివరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. అయితే తన సినిమా పోస్టర్ కేవలం ప్రచారం కోసమే విడుదల చేయలేదని.., సినిమా చూస్తే ఆ సీన్ అర్ధం అవుతుందని వివరణ ఇచ్చాడు. తొలి పోస్టర్ ఇంత సంచలనం కావటంతో.., రెండవ పోస్టర్ ఎలా ఉంటుందా అని ఎదురు చూసిన అభిమానులకు క్రేజీగా ఇలా కన్పించాడు. ఈ పోస్టర్ పై ఏ విమర్శలు.., కామెంట్లు వస్తాయో చూడాలి మరి. ఈ సినిమాలో అమీర్ తో పాటు సంజయ్ దత్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)