కాంమాంధుల కబంధహస్తాల్లో చిత్రహింసలనుభవించి.. 13 రోజులు మృత్యువుతో పోరాడి.. ధీరురాలిగా ఘనతకెక్కి సమాజానికో సందేశాన్నిచ్చి వెళ్లిన ఆ బిడ్డ ఫొటో, పేరు ఎట్టకేలకు బయటకు వచ్చాయి. నిర్భయ తండ్రి బద్రీసింగ్ పాండే తన స్వగ్రామం బలియాలో అంతర్జాతీయ పత్రిక డెయిలీ మిర్రర్ సన్ డే ఎడిషన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలోనే తన కూతురి పేరు వెల్లడించారు. ‘నిర్భయ అసలు పేరు జ్యోతిసింగ్ పాండే. నా కూతురు జ్యోతి ఏ తప్పు చేయలేదు. అత్యాచార నిరోధక చట్టానికి తన కూతురు పెడితే సంతోషమే. ప్రపంచానికి జ్యోతి పేరు తెలియాలి’ అని చెప్పారు.
కాగా, బద్రీసింగ్ పాండే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ట్రాన్స్‌పోర్టు లోడర్‌గా పని చేస్తున్నారు. తన కూతరు స్నేహితుడు అవీంద్ర గొప్ప ధైర్యవంతుడని, అతని సాహసాన్ని నా కూతురు మెచ్చుకుందన్నారు. జ్యోతికి ప్రమాదం జరిగిందని మాత్రమే పోలీసులు మొదట తనకు చెప్పారని, ఆస్పత్రికి వెళ్లే సరికి తను స్పృహలో లేదన్నారు. మొదటి పది రోజుల్లో బతుకుతానన్న నమ్మకం తన కూతురిలో కనిపించదని, పరిస్థితి విషమించడంతో చిన్నప్రేగు తొలగించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏమి చెప్పదలుచుకుందో అవి వ్రాతల ద్వారా కొంతవరకూ జ్యోతి తెలియచేసిందని వెల్లడించారు. తనకూతురు లేని లోటు తమ కుటుంభానికి తీరని వెళితి అని ఆయన విచారవదనంతో వెల్లడించారు. తన కూతురికి పట్టిన దుస్థితి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా పునరావ్రుతం కారాదని, ప్రతీ చోటా యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు.
అయితే.. తనకూతురి ఫొటోను మాత్రం ప్రచురించవద్దని బద్రీసింగ్ కోరారు. అందుకనే ఇక్కడ ఆమె ఫొటో పబ్లిష్ చేయటంలేదు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more