ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చిర్రెత్తుకొచ్చింది. పూర్తిస్థాయిలో అక్బర్ కు తలంటేసింది. తనపై పెడుతున్న కేసుల నేపధ్యంలో హైకోర్టును అక్బర్ ఆశ్రయించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 8న ఆదిలాబాద్ పోలీసులు, 22న నిర్మల్ పోలీసులు కేసులు నమోదు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారని.. ఒకే నేరానికి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట విరుద్ధమని...రోజుకో కేసు నమోదు చేస్తున్నారని, వాటి వివరాలు తెలుసుకోవడం పిటిషనర్‌కు అసాధ్యమని అక్బరుద్దీన్ తరపున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి తెలిపారు.
వీటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేయాలని సీతారామ్మూర్తి కోరడంపై న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంటే ఫిర్యాదులు చేయకుండా ప్రజలను ఆపాలంటారా? ఆ పని ఈ కోర్టు ఎలా చేయగలదు? రాష్ట్రంలో ఫిర్యాదుల మాట పక్కన పెట్టండి. వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే ఫిర్యాదుల మాటేమిటి? వాటిని ఎలా అపగలం? ’ అని ప్రశ్నించారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ‘‘పిటిషనర్ (అక్బరుద్దీన్) మాట్లాడిన వీడియోలను నేను యూట్యూబ్‌లో చూశా. దారుణమైన వ్యాఖ్యలు ఉన్నాయి. రాముడి తల్లి ఎక్కడెక్కడ తిరిగి రాముడికి జన్మనిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధిక మంది ఆరాధించే భగవంతుడి విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అలాంటి మాటలు ఎలా అనగలిగారు? అరే హిందుస్థానీ అంటూ కూడా సంబోధించారు. మరి ఆయన ఉండేది ఎక్కడ? హిందుస్థాన్‌లో కాదా? 15 నిమిషాలపాటు పోలీసులను పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువుల అంతుచూస్తాడట..! నాకున్న పరిధి మేరకు పోలీసులను 15 నిమిషాలు కాదు అరగంటసేపు ఆపుతా. ఏం జరుగుతుందో చూస్తాం. అందరినీ చంపేస్తారా’ అని ప్రశ్నించారు.
అంతేకాదు, ఆయనపై హత్యాయత్నం జరిగినప్పుడు కాపాడింది పోలీసులేనన్న సంగతిని మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం ద్వారా అక్బరుద్దీన్ ఈ దేశానికే సవాలు విసిరాడు. ఆ సవాలుపైనే నిలబడమని చెప్పండి. దాని నుంచి వెనక్కి ఎందుకు తగ్గుతున్నట్లు? అక్బర్ ప్రశాంతంగా కూర్చొని ఆయన మాట్లాడిన వీడియోను చూడమని చెప్పండి. ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకుంటారు. ఈ దేశం నుంచి పోయేటప్పుడు చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌మినార్ తీసుకుపోతాడట. భారతదేశమంటే ఈ మూడేనా? ఈ మూడు లేకుంటే దేశం లేదా? ఈ దేశం ఆయన తండ్రిని ఎంపీని చేసింది. ఆయన సోదరుడినీ ఎంపీని చేసింది. ఆయన్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. మరి ఈ దేశానికి వారు ఇచ్చేది ఇదేనా? ప్రతి స్పందనకు ప్రతిస్పందన ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయనకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. రాజకీయాల్లో రాణించాల్సి ఉంది. అటువంటి వ్యక్తి అనాల్సిన మాటలు కావివి. అక్బర్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కులమతాలకు అతీతంగా ప్రార్థించారు. ఆయన మాత్రం ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ముస్లింలదరూ ఆయన చెప్పిన దారిలో నడుస్తారని ఆయన భావిస్తున్నారా’ అని ప్రశ్నించారు.
ఇకపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడటం, నామకహా పాతబస్తీలో పోలీసులపై సంఘవిద్రోహశక్తుల రాళ్లదాడులు మినహా అటు ముస్లీంలనుంచీ అక్బరుద్దీన్ కి మద్దతు లభించకపోవటంతో, ఎంఐఎం పార్టీ దిక్కుతోచని సంకటస్థితిలో పడింది. అనుచిత వ్యాఖ్యలకు అక్బర్ భారీ మూల్యం చెల్లించకతప్పదని ఇది దేశ ద్రోహం, కుట్ర కిందకి వస్తుందని న్యాయనిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
దీనంతటికీ కారణమైన అక్బర్ ప్రసంగం ఇదే..
....avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more