ఇంతకీ రుణం అంటే ఇమిటి? ఎవరినుంచైనా డబ్బు అప్పుగా తీసుకోవడం రుణం అని మాత్రమే చాలామందికి తెలుసు. ఒకరిదగ్గరి నుంచి మనం తీసుకున్న వస్తులుగానీ, పదార్థాలు గానీ తిరిగి ఇవ్వకపోతే అది కూడా బాకీపడటమే అవుతుంది. ఇలా కాకుండా మరికొందరైతే ‘‘ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే, వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని’’ విచిత్రంగా చెప్తుంటారు. ఈ సాధారణ రుణాల సంగతి అలా ఉంచితే అనుబంధాల రీత్యా కూడా ఋణపడతాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం. జీవరాశుల్లోకెల్లా మానవ జన్మే ఉత్కృష్టమైంది . ఎందుకంటే మానవునికి మాత్రమే మనసు, మేధస్సులు ఉన్నాయి. మరి ఇంత ఉన్నతమైన మానవజన్మను మనకు ప్రసాదించిన దేవుడికి తప్పకుండా రుణపడతాం. అందువల్ల దేవ రుణం తప్పకుండా తీర్చుకోవాలి. అది మన కర్తవ్యం కూడా. దేవుడు మనకు కేవలం జన్మను మాత్రమే ఇవ్వలేదు. ప్రకృతితో సహా జీవితంలో కావలసినన్ని అవసరాలు కూడా ప్రసాదించాడు. మన శరీర ప్రక్రియను మించిన అద్భుతమైన యంత్రం మరే జీవికి వుండదు. మరి ఈ అపురూపమైన మానవజన్మను సక్రమంగా వినియోగించుకుంటే సుఖం, శాంతి ఉంటుంది. మన పుట్టుక సార్ధకమౌతుంది.
దేవ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే.. దేవునికి మన సంపదలన్నింటిని సమర్పించనవసరం లేదు. ఆరాధనతోనే రుణం తీర్చుకోవాలి. రోజూ సంధ్యావందనం చేయాలి. సంధ్య సమయంలో తప్పనిసరిగా యజ్ఞ కర్మ ఆచరించాలి. సమిధలు, మూలికల మిశ్రమం, ఆవునెయ్యి ఉపయోగించి, యజ్ఞ కర్మ ఆచరించాలి. యజ్ఞ కర్మ వల్ల మానసిక శాంతి కలగడమే కాదు, వాతావరణ కాలుష్యం నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు. కనుక యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలూ బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది. ఇప్పుడు యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో నూటికికోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞ కర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. యజ్ఞయాగాదులు చేయడమేంటి... మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే, మనము, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతయినా నిరోధించగల్గుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్తున్నాయి పురాణాలు. ఒకరకంగా దేవ రుణం తీర్చుకోవడం అంటే, మనకు మనం మేలు చేసుకోవడమే!
(And get your daily news straight to your inbox)
Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more
Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more
Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more
Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more
Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more