మన అభిప్రాయాలను తెలియచేయడానికి గట్టిగా అరవాల్సిన పని లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ స్పష్టం చేశాడు. రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల పదవీ స్వీకారం చేసిన సచిన్ ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెద్దగా అరిస్తేనే అభిప్రాయాలను ప్రకటించినట్టు కాదని వ్యాఖ్యానించాడు. రాజ్యసభ సభ్యుడిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని, అయితే, అరవడం తనకు అలవాటు లేదని, సవ్యం గానే చెప్తానని అన్నాడు. బహుశా తనను అరిపించాలని ఎవరూ కోరుకోరని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెప్పుకోదగిన పతకాలు లభిస్తాయని అన్నాడు. భారత బృందం విజయాలను సాధించి, పతకాలు గెల్చుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తానని సచిన్ చెప్పాడు. అయితే, పతకాలు వచ్చాయా లేదా అన్నది ముఖ్యం కాదని అన్నాడు. శక్తివంచన లేకుండా కృషి చేస్తే పతకాలు లభించకపోయినా ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నాడు. టెస్టు క్రికెట్లో డే/నైట్ మ్యాచ్‌లకు తాను వ్యతిరేకం కాదని సచిన్ స్పష్టం చేశాడు. అయితే, ఈ విధానాన్ని నేరుగా టెస్టుల్లో ప్రవేశపెట్టే కంటే ముందు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more