శనివారంనాడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరంభమవుతున్న రెండో క్రికె ట్ టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా తమ శక్తివంచన లేకుండా ఆడతా మని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్‌వాట్సన్ తెలిపాడు. కంగారూల జట్టు మూడు గంటలకు పైగా ఉప్పల్ నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత వాట్సన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్ దూకుడుగా ఆడడమే నని, దాన్ని ఇకనుంచి తమ ఆటగాళ్లంతా అనుసరించేందుకు ప్రయత్నిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. చెనై్నలో జరిగిన తొలి టెస్ట్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్‌ల సీరీస్‌లో 1-0 తేడాతో వెనుకబడిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్‌ను మేం గెలుచుకోవాలి. అందులో ఎలాంటి సందే హం లేదు. అందువల్ల మా ప్రతిభా సంపత్తి మేర ఆడి ఇండియా ను ఓడించేందుకు ప్రయత్నిస్తాం అని అన్నాడు. ఒకప్పుడు ప్రపం చంలో అత్యుత్తమ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా ఇటీవల కాలంలో కొంత వెనుకబడినప్పటికీ.. మా దూకుడు క్రికెట్‌ను మళ్లీ ఇప్పుడు ఆడాల్సి ఉందన్నాడు. చెనై్నలో ఇండియా గెలుపు తర్వాత మేం వారినుంచి ఎంతో నేర్చుకున్నామని వాట్సన్ వివరించాడు. ఓపెనర్‌గా తాను ఇంతకు ముందు వరకు ఎంజాయ్ చేశానని, కాని ప్రస్తు తం నాలుగో బ్యాట్స్‌మన్ రోల్ కూడా సంతోషంగానే ఉందని వాట్సన్ వివరించాడు. కాగా చెనై్న టెస్ట్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎదురుదాడికి దిగి పరుగులు కొల్లగొట్టడం వల్లనే మ్యాచ్ తమ చేతిలోంచి చేజారిపోయిందన్నాడు. ఫిట్‌నెస్ సమస్య వల్ల బౌలింగ్‌కు దిగలేకపోతున్నానన్న వాట్సన్ ఇకనుంచి దానిపై కూడా దృష్టి పెడతానని తెలిపాడు. మరో మూడు నెలల్లో తిరిగి బౌలింగ్‌కు దిగుతానని ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more