గత మ్యాచ్ లో తన సొంత మైదానంలో పూణె జట్టు పై ఓడిపోయిన చెన్నై నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. గత ఓటమి నుండి గుణపాఠం నేర్చుకున్న చెన్నై సమిష్టిగా రాణించి 37 పరుగుల భారీ తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలటమే కాకుండా, వరుసగా ఆరు మ్యాచ్ ల్లో గెలిచి డబల్ హ్యాట్రిక్ సాధించింది. తొలు బ్యాటింగ్ కి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆరంభంలో తడబడ్డారు. హస్సీ (5), సాహా (13)ల వికెట్లను కోల్పోయింది. అయితే ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రైనా బదిరినాథ్ (34) సహకారంతో అజేయంగా అర్థశతకం పూర్తి చేసి, (63) పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ధోని చివరి ఓవర్లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 45 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాదులు వేశాడు.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పుణె టాప్ ఆర్డర్ వికెట్లను టప టప కోల్పోయింది. మిడిలార్డర్‌లో స్మిత్ (35)కు తోడు టైలేండర్లు రిచర్డ్ సన్ (26), భువనేశ్వర్ (24 నాటౌట్)ల మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో పుణె నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైయింది. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ ధోనికి లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more