ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారత దేశ క్రీడాకారులకు అందించే అత్యుత్తమ పురస్కారలాను నేడు ప్రకటించింది. క్రీడల్లో అశేష ప్రతిభను కనబర్చిన పలువురు క్రీడా కారుల పేర్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రీడా పురస్కారాల్లో ఎంతో అత్యున్నతమైన పురస్కారంగా భావించే ‘రాజీవ్ ఖేల్ రత్నా ’ అవార్డును పంజాబ్ క్రీడాకారుడు షూటర్ అయిన రంజన్ సోదీని వరించింది. రంజన్ సోదీ షూటింగులో అశేష ప్రతిభ కనబర్చి, అనేక పతకాలను గెచ్చుకుందుకు ఈ పురస్కారనికి ఎంపింక చేసింది. ఇక క్రికెట్ విషయానికి వస్తే... భారత యువ క్రికెటర్, భావి భారత క్రికెట్ కెప్టెన్ గా చెప్పబడుతున్న మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ అయిన విరాట్ కోహ్లీకి గత కొన్ని రోజుల నుండి జట్టుకు అందిస్తున్న సేవలకు గానీ అర్జున అవార్డును కట్టబెట్టింది. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తూ, సుదీర్ఘ కాలం తర్వాత మన దేశానికి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్య పతకాన్ని అందించిన హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణి పి.వి సింధును కూడా అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. ఇంకా అర్జున అవార్డుకు ఎంపికైన క్రీడాకారుల్లో.... చెక్రెవోలు స్వురో (అర్చరీ విభాగం), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్స్) కవితా చాహల్ ( బాక్సింగ్), రూపేష్ షా (స్నూకర్), గగన్ జిత్ భుల్లార్ ( గోల్ఫ్), సబ అంజుమ్ ( హాకీ), రాజ్‌కుమారి రాథోర్ (షూటింగ్), జోహ్న చిన్నప్ప ( స్వాస్), మౌమదాస్ ( టేబుల్ టెన్నీస్), నెహ రాధి (వ్రెస్టిలింగ్), ధర్మేంధ్ర దలాల్ (వ్రెస్టిలింగ్), అమిత్ కుమార్ సరోహ (పరస్పోర్ట్స్) తదితరులు ఎంపికయ్యారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more