New zealand second innings allout for 105

New Zealand second innings, allout for 105, Brendon McCullum, India tour of New Zealand, India-New Zealand Test, Dhoni, Ross Taylor, Rohit Sharma,

ndia ended New Zealand second innings for 105 runs on day three of the first cricket Test at Eden Park, in Auckland on Saturday

న్యూజిలాండ్ 105 కే ఆలౌట్ అయ్యింది

Posted: 02/08/2014 10:41 AM IST
New zealand second innings allout for 105

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ చెత్త ప్రదర్శన చేసి, కనీసం కివీస్ బ్యాట్స్ మెన్ మెకల్లమ్ చేసిన 224 పరుగులను కూడా జట్టు మొత్తం మంది కలిసి చేయలేదు. ఇది మొన్నటి వరకు నెంబర్ జట్టుగా ఉన్న మన వాళ్ళ ప్రదర్శన. మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

దీంతో కివీస్ 301 భారీ ఆధిక్యంలో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 503 పరుగలు చేశారు. రెండో రోజు 130 – 4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రాంభించిన మనవాళ్ళు కేవలం 72 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. భారత బ్యాట్స్ మెన్స్ లో రోహిత్ శర్మ 72, ధోని 10, జహీర్ ఖాన్ 14 లు రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారు ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు. జడేజా 3 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. కివీస్ బౌలర్లో వాగ్నేర్ 4, బౌల్ట్ 3, సౌతీ 3 వికెట్లు పడగొట్టారు.

ఇక  రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ ను 105 పరుగులకే ఆలౌట్ చేశారు ఇండియా బౌలర్లు. ఇండియా బౌలర్లలో షమీ 3, ఇషాంత్ శర్మ 3, జహీర్ ఖాన్ 2, జడేజా ఒక్క వికెట్ తీశారు. ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉండటంతో ఇండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వికెట్లను కాపాడుకుంటే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles