Sachin cover of 2014 wisden cricketers almanack

sachin Tendulkar, Test cricket, London,International Cricket Council, 2014 edition of Wisden Cricketers

Sachin Tendulkar adorns cover of 2014 Wisden Cricketers Almanack.

సచిన్ కి దక్కిన అరుదైన గౌరవం

Posted: 04/10/2014 11:11 AM IST
Sachin cover of 2014 wisden cricketers almanack

సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ కెరియర్ ని కొనసాగించి, ఎన్నో విజయాలు, కీర్తి ప్రతిష్టలు, అవార్డులు అందుకొన్న క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంత వరకు భారత క్రికెట్ దిగ్గజాలకు కూడా దక్కిని గౌరవం దక్కింది. ‘విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ ’ కవర్ పేజీ పై సచిన్ ముఖ చిత్రం దర్శనం ఇవ్వబోతుంది.

గత సంవత్సరం నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ గుడ్ చెప్పిన సచిన్ కి ఎన్నో ఘనతలు సాధించినందుకు గౌరవసూచకంగా ముంబై వాంఖడె స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో చివరి ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు తిరిగివస్తున్న చిత్రాన్ని విజ్డెన్ 151వ ఎడిషన్ కవర్ పేజీపై ముద్రించారు. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన సచిన్ కి మేమిచ్చే గౌరవం ఇదే అని విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ చెప్పారు.  ‘విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్-2014’ గురువారం లండన్‌లో విడుదల కానుంది.

ఇక పోతే... భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ కు ‘విజ్డెన్ మేటి క్రికెటర్ల జాబితా’లో చోటు దక్కింది. గత ఏడాది అద్భుతంగా రాణించిన ఐదుగురు క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు. భారత్ విజేతగా నిలిచిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఈ ఓపెనర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 90.75 సగటుతో 363 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెల్చుకున్నాడు. మొత్తంగా 2013లో ధావన్ 26 వన్డేలు ఆడి 1162 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles