New zealand cricketer chris cairns working as bus shelter cleaner

new zealand cricketer chris cairns, chris cairns latest news, chris cairns news, chris cairns match fixing allegatioins, chris cairns bus shelter cleaner, chris cairns family members, chris cairns childern

new zealand cricketer chris cairns working as bus shelter cleaner

ఒకప్పటి ఆల్ రౌడర్.. బస్ షెల్టర్ క్లీనరయ్యాడు!

Posted: 09/19/2014 03:06 PM IST
New zealand cricketer chris cairns working as bus shelter cleaner

ప్రపంచ క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్.. తన ఆల్ రౌడ్ ప్రతిభతో బ్యాట్స్ మెన్, బౌలర్లను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే! ఇతను బరిలోకి దిగితే చాలు.. ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఒకవైపు అద్భుతమైన బ్యాటింగ్ తో ఫీల్డర్లను పరిగెత్తించి.. మరోవైపు తన బౌలింగ్ తో ప్రముఖ బ్యాట్స్ మెన్లను పవేలియన్ కు పంపించే ఈ ఆటగాడి పరిస్థితి ప్రస్తుతం ఎంతో దయనీయంగా మారిపోయింది. ఇతడు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇతనిని జట్టునుంచి తొలగించడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది.

ఒకప్పుడు డబ్బుల కొరత లేకుండా దర్జాగా జీవితాన్ని ఆస్వాదించిన క్రిస్.. నేడు కూటికోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్ కు ప్రపోజ్ చేయడానికి 3.2 క్యారెట్ల డైమండ్ ను కొనుగోలు చేసిన ఇతగాడు.. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా మారడంతో తప్పని పరిస్థితిలో న్యూజిలాండ్ దేశంలోని అక్లాండ్ లో ట్రక్కులను నడపడమే కాకుండా, బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి సిద్దపడ్డాడు. బస్ షెల్టర్లు క్లీన్ చేసి గంటకు 17 డాలర్లను సంపాదిస్తున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇతనికి సొంత ఇల్లు లేదు.. ప్రస్తుతమున్న ఇంటికి అద్దె చెల్లించాలి. పైగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తీర్చాలి. ఇటువంటి పరిస్థితుల్లో క్రిస్ కు మరోదారి దొరక్క ఇలా క్లీనర్ గా మారాడు.

ఇతను ఈ విధంగా వున్న దయనీయ పరిస్థితిని చూసి కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబాన్ని కష్టాల్లోంచి గట్టెక్కించడానికి క్రిస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడని.. అందులో భాగంగానే అతను బస్ షెల్టర్లను క్లీన్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడని ఇతని సహచన క్రికెటర్ డియాన్ నాష్ మీడియాతో పేర్కొన్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలతోనే అతను బలయ్యాడని.. వాటి నుంచి అతను నిజాయితీగా బయటపడతాడని.. అందుకు తన మద్దతు కూడా వుంటుందని అతను పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles