Australia wins first test with 48 runs

Australia wins first test, Australia Wins adelaide test, Aussies pulled match from india, nathan lyon pulls indian match, aussies wins with 48 runs, nathan lyon 7 wickets, aussies stunning victory, australia wins first test with india, aussies beat india first test 2014, 2014 australia vs india, 2014 australia vs india first test

adelaide Test:, Australia beat India by 48 runs in first test thriller. As spinner Nathan Lyon took seven second-innings wickets and 12 for the match as Australia pulled off a stunning 48-run win over India on Saturday in the first test.

వృధా అయిన విజయ్, కోహ్లీ పోరాటం.. తొలిటెస్టులో భారత్ పరాజయం..

Posted: 12/13/2014 01:52 PM IST
Australia wins first test with 48 runs

అస్ట్రేటియాలోని అడిలైట్ లో భారత్, అస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయతీరాల ముంగిట బోర్లా పడింది. కేవలం 48 పరుగుల దూరంలో లక్ష్యం కనపిస్తూన్నా.. భారత క్రికెటర్లు చేజార్చుకున్నారు. మరో పది ఓవర్లు మాత్రమే మిగిలివున్న తరుణంలో డ్రా చేసుకునేందుకు కూడా భారత బాట్స్ మెన్ సిద్దంగా లేని పరిస్థతి ఎదుర్కున్నారు. ఒక్క సెషన్ లో 37 ఓవర్లతో బరిలో దిగిన అస్ట్రేలియా అనుకున్న స్థాయిలో విజృభించి.. భారత బ్యాట్స్ మెన్ విక్కెట్లను తీయడంలో సఫలమైంది.

315 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన క్లోహ్లీ సేన రెండవ ఇన్నింగ్ లో అంతగా రాణించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో తమ సత్తాను కొంతైనా చాటేందుకు ఉవ్విళ్లూరిన భారత అటగాళ్లు రెండవ ఇన్నింగ్స్ లో పూర్తిగా విఫలమయ్యారు. మురళీ విజయ్ 99 పరుగులు సాధించగా, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్ అడి 141 పరుగులు సాధించాడు. వీరిద్దరి మినహా భారత బ్యాట్స్ మెన్ లలో ఎవ్వరూ పెద్దగా క్రీజ్ లో నిలువలేకపోయారు. టీమిండియా బ్యాట్స్ మెన్ నుంచి విరాట్ కు ఎలాంటి సహకారం లభించకపోవడంతో.. ఆయన 141 పరుగుల వద్ద లియాన్ విసిరిన బంతికి మార్ష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా నిఫ్రయోజనంగా మారింది. అనూహ్యంగా స్పిన్ తిరుగుతున్న పిచ్ మీద నాథన్ లియాన్ బౌలింగులో భారీ షాట్ కొట్టాలని చూసిన కోహ్లీ.. బౌండరీ లైన్ వద్ద వార్నర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో 141 పరుగులు చేసిన కోహ్లీ.. తాను అవుటైన విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. వీడలేక.. వీడలేక.. క్రీజును వదిలిపెట్టి వెళ్లాడు. తొలి టెస్టు చివరిరోజు పిచ్ తీరు అనూహ్యంగా మారిపోయింది. విపరీతంగా స్పిన్ తిరగడంతో నాథన్ లియాన్ టీమిండియా వెన్ను విరిచాడు. అరివీర భయంకరంగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా ఏడుగురు భారత బ్యాట్స్మన్ను పెవిలియన్ బాట పట్టించి రికార్డు సాధించాడు. దాదాపుగా భారత జట్టు చేతి నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.

ఒక దశలో పటిష్ఠంగా ఉందనుకున్న భారత బ్యాటింగ్ లైనప్.. మురళీ విజయ్ 99 పరుగుల వద్ద ఔటయినప్పటి నుంచి పేకమేడలా కుప్పకూలిపోయింది. మేటి బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, మొదటి ఇన్నింగ్స్లో 62 పరుగులతో ఆకట్టుకున్న అజింక్య రహానే కూడా సింగిల్ డిజిట్లకే బ్యాట్ చంకలో పెట్టుకుని వెనుదిరిగారు. ఆఖరి 8 వికెట్లను కేవలం 73 పరుగుల తేడాలోనే భారత్ చేజార్చుకుంది. 16 పరుగుల వద్ద తొలివికెట్ కోల్పోయి, 57 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయిన టీమిండియా.. ఆ తర్వాత 242 పరుగుల వరకు ఆస్ట్రేలియన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఒకవైపు మురళీ విజయ్, మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరివీర భయంకరంగా ఆడుతూ సెంచరీలవైపు దూసుకెళ్లారు. అయితే దురదృష్టవశాత్తు మురళీ విజయ్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఇక అక్కడినుంచి ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. కోహ్లీ తప్ప.. మిగిలిన బ్యాట్స్మన్ అంతా పెవిలియన్కు క్యూకట్టేశారు. జాన్సన్కు రెండు వికెట్లు, హారిస్కు ఒక వికెట్ దక్కాయి.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా 517/7, 290/5 (డిక్లేర్)
భారత్ 444, 315
భారత్ రెండో ఇన్నింగ్స్
మురళీ విజయ్ 99; శిఖర్ ధవన్ 9; పుజారా 21; విరాట్ కోహ్లీ 141; రహానే 0; రోహిత్ శర్మ 6; వృద్ధిమాన్ సాహా 13; కరణ్ శర్మ  4 (నాటౌట్); మహ్మద షమీ 5; వరుణ్ ఆరోన్ 1; ఇషాంత్ శర్మ 1

నాథన్ లియాన్ 7 వికెట్లు, జాన్సన్ 2, హ్యారిస్ 1

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia Vs India 2014  adelaide Test  Australia  india  first test  nathan lyon  

Other Articles