Mccullum blitz sets up new zealand victory

mccullum blitz sets up new zealand victory, mccullum sets up new zealand victory, mccullum half century, mc cullum century, mccullum records, mccullum achievements, mccullum photos, mccullum runs, mccullum records

A cracking half-century by Brendon McCullum set New Zealand up for a comfortable three-wicket win over Sri Lanka in their first one-day international in Christchurch on Sunday.

మెక్ కల్లమ్ వీరవిహారం.. లంకపై కివీస్ విజయం

Posted: 01/11/2015 10:42 PM IST
Mccullum blitz sets up new zealand victory

శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రాండెన్ మెక్ కల్లమ్ తన బ్యాట్ తో మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 19 బంతులను ఎదుర్కొన్న మెక్ కలమ్ మూడు సిక్స్ లు, మూడు ఫోర్లతో 51 పరుగులు చేసి  కివీస్ కు సునాయాస విజయం అందించాడు. శ్రీలంక విసిరిన 219 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది.

మెక్ కల్లమ్ దూకుడుగా ఆడి రన్ రేట్ ను ముందుకు తీసుకెళితే.. కోరె అండర్సన్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో 43 ఓవర్లలో లక్ష్యాన్ని  చేరుకున్న కివీస్ మూడు వికెట్ల తేడాతో లంకేయులపై జయభేరీ మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 218 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే(104) పరుగులు చేసి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలుపంచుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brendon McCullum  srilanka  new zealand  first one day  

Other Articles