భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను అనవసరంగా వివాదాల్లోకి లాగిన ఓ పత్రికా సంపాదకుడు ఇబ్బందుల్లో పడ్డాడు. రవీంద్ర జడేజాను కబ్జాదారుడిగా, దగాకోరుగా అభివర్ణిస్తూ.. రాజ్ కోట్ సాయంకాలపు దినపత్రిక అబ్ తక్ సంపాదకుడు, యజమాని సతీస్ మోహతా తన పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించారు. గత ఏడాది నవంబర్ 20న ఈ కథనం ప్రచురితమైంది. జడేజాతో పాటు ఆయన వ్యాపార భాగస్వామి జినీష్ అజ్మీరాకు స్థానికంగా భూకబ్జాదారుడైన బాలీ దాంగర్ తో సంబంధాలు వున్నాయని, దీంతో వారు కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కథనాన్ని అబ్ తక్ పత్రిక ప్రచురించింది
ఈ కథనంపై స్పందించిన రవీంద్ర జడేజా తనను భూ కబ్జాదారుడిగా, దోపిడీదారుడిగా చిత్రీకరించి ఎందుకు కథనాన్ని ప్రచురించారని అబ్ తక్ దినపత్రిక కార్యాలయానికి ఆశ్రయించారు. అక్కడి సరైన స్పందన కరువవ్వడంతో ఆయన రాజ్ కోట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జడేజా తరపున ఆయన న్యాయవాది హిరెన్ భట్.. రాజ్ కోట్ న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. జడేజా పిటీషన్ ను విచారణకు స్వీకరించిన రాజ్ కోట్.. ప్రిన్సిఫల్ సీనియర్ సివిల్ జడ్జి పీబి పార్మర్ వచ్చే నెల 4న పత్రికా సంపాదకుడిని కోర్టులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
అబ్ తక్ పత్రికలో రాసినట్లు జడేజాకు భూకబ్జాదారుడు బాలీ దంగర్ తో సంబంధాలు లేవని, తాను ఇప్పటి వరకు అతన్ని చూడలేదని భట్ చెప్పుకోచ్చారు. కాగా జడేజా వ్యాపార భాగస్వామిగా పత్రిక పేర్కొన్న అజ్మేరా ఏ వ్యాపారంలోనూ భాగస్వామి కాదని చెప్పుకోచ్చారు. ఇలాంటి తప్పుడు కథనంతో జడేజా పరువుకు భంగం కలిగించినందుకు గాను రూపాయలు 51 కోట్లు తనకు నష్టపరిహారంగా చెల్లించాలని భట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే నవంబర్, డిసెంబర్ మాసాలలో తాము పత్రిక పంపాదకుడికి లీగల్ నోటీసులు పంపామని, వాటిపై ఆయన స్పందించనందునే తాము కోర్టను ఆశ్రయించామని హిరెన్ భట్ చెప్పుకోచ్చారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more