India versus pakistan match in world cup

india versus pakistan match in world cup, india score, pakistan score, 100 crore viewers , ind-pak match tickets hot cake, india defend world cup record, pakistan wickets, world cup india score, world cup india runs, world cup india phots, Virat Kohli, Rohit Sharma, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores,

India will try to defend a proud World Cup record while Misbah-ul-Haq’s men will relish the opportunity of creating history

దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అభిమానుల ఉత్కంఠ..

Posted: 02/14/2015 08:20 PM IST
India versus pakistan match in world cup

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ లో హాట్ హాట్ మ్యాచ్ గా క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్ మరి కోన్ని గంటల్లో జరగనుంది. ఆ రెండు జట్ల మధ్య ఫోరు ఎప్పుడ జరిగినా అభిమానుల రోమాలు నిక్కపోడుచుకుంటాయి. కప్ ఏదైనా, వేదిక ఎక్కడైనా.. ఆ రెండు జట్లు విజయమే లక్ష్యంగా పోరాడుతాయి. ఇరు జట్లు.. అభిమానుల అంచనాలు కూడా అలాగే ఉంటాయి. అవే దాయాధి దేశాలు భారత్, పాకిస్థాన్ లు. భారత్ సరిహద్దులో పాకిస్థాన్ పాల్పడుతున్న కాల్పలు ఉల్లంఘనల నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య సీరీస్ లు జరగడం లేదు. దీంతో ఈ రెండు జట్లు తలపడేందుకు కేవలం కప్ లు మాత్రమే వేదికగా నిలుస్తున్నాయి.

అందులో భాగంగానే వచ్చిన ప్రపంచ కప్ 2015లో తలపడుతున్న ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా కదులుతున్నాయి. ఎవరి చేతిలో ఓడినా ఫర్వాలేదు. పాకిస్తాన్ చేతిలో ఓడితే తల కొట్టేసినంత ఫీల్ అయిపోతారు భారత జట్టు అభిమానులు. ప్రతిక్షణం, ప్రతిబాల్, ప్రతీ పరుగు, ప్రతీ వికెట్, ఫీల్డ్ లో ప్రతి కదలిక ఉద్విగ్నంగానే ఉంటుంది. దాయాది పాక్తో, అదీ ప్రపంచకప్లో పోరు అంటే మాటలా! అభిమానుల అంచనాలు తలకిందులైతే ఎంత తలవంపు. ఎలాగైనా గెలవాలి. పట్టుదలతో ఆడాలని,  అభిమానుల ఆదరణను పొందాలని క్రికెట్ టీం ఆరాటం పడుతుంటాయ్.

ప్రపంచకప్ మ్యాచ్ల్లో ఇండియా, పాకిస్తాన్ ఐదుసార్లు తలపడగా ప్రతిసారీ విజయం భారత్నే వరించింది. ఈ రికార్డును నిలబెట్టుకోవడం ధోనీ ముందున్నమొదటి లక్ష్యం. అదే జరుగుతుందని భారత్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరోసారి అయినా భారత్ను ఓడించాలని పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ గట్టి ప్రయత్నమే చేస్తాడనడంలో సందేహం లేదు. అడిలైడ్ ఓవల్ వేదికగా మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. ఒత్తిడిని అధిగమించే జట్టుదే విజయం. స్టేడియంలో ఇరు దేశాల అభిమానులతో కిక్కిరిసి పోతుంది. అభిమానులు భారత్ జీతేగా అంటూ నినాదాలు మిన్నంటనున్నాయి. ప్రతీ బంతికి స్పిక్ కోట్టాలని ఒకరు అరవడం, మరోకరు వికెట్ తీయాలని ఆరవడంతో.. స్టేడియం కోలాహలంగా మారనుంది.

టీమిండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, Axar పటేల్, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్.

పాకిస్తాన్: అహ్మద్ షహద్, నాసిర్ జంషెడ్, యూనిస్ ఖాన్, ఉమర్ అక్మల్, మిస్బా-ఉల్-హక్ (కెప్టెన్), సోహెబ్ మఖ్సూద్, సర్ఫరాజ్, అహ్మద్ (వికెట్ కీపర్), షాహిద్ అఫ్రిదీ, హారిస్ సొహైల్, యాసిర్ షా, మొహమ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్, ఎహ్సాన్ ఆదిల్, రాహత్ ఆలీ, సోహైల్ ఖాన్.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  india  pakistan  Adelite  

Other Articles