India storm into semifinals by thrashing bangladesh by 109 runs

India versus Bangladesh, India vs Bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, bangaldesh, India, Australia, pakistan, newzealand, west indies, bangaldesh, bangaldesh CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

Rohit Sharma blasted a strokeful century as defending champions India stormed into the semifinals of the ICC World Cup 2015 by thrashing a hapless Bangladesh by 109 runs in a lop-sided contest here on Thursday.

సెమీస్ కు దూసుకెళ్లిన దోణిసేన.. బంగ్లా ఖేల్ ఖతం..

Posted: 03/19/2015 06:54 PM IST
India storm into semifinals by thrashing bangladesh by 109 runs

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై జరుగుతున్న మ్యాచ్ లో ఆద్యంతం టీమిండియా ఫేవరేట్ గా సాగింది. ప్రపంచ కప్ లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసుకుని సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. సెమీస్ లో మూడవ క్వార్టర్ ఫైనల్ లో తలపడే అసీస్,  పాకిస్థాన్ జట్టలో గెలుపోందే జట్టుతో భారత్ తలపడనుంది. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో 109 పరుగుల భారీ విజయాన్ని ధోణి సేన నమోదు చేసుకుంది.

భారత్ తో మ్యాచ్ లో ఏ దశలోనూ బంగ్లా పోటీ ఇవ్వలేకపోయింది. తమీమ్ , సౌమ్య సర్కార్, మహ్మదుల్లా షకీబ్ ల నుంచి మంచి ప్రారంభాలు ఇచ్చినా.. పెద్ద స్కోరుగా సాధించడంలో విఫలమయ్యారు. టీమిండియా నిర్ధేశించిన 303 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 45 ఓవర్లలలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆదిలోనే రెండు విక్కట్లను కొల్పోయి కష్టాలలో పడిన బంగ్లా ఆ తరువాత నిలదోక్కుకుంది అనుకున్న ప్రతీసారి వికెట్లను కోల్పోయింది. పాతిక ఓవర్లలోపు నాలుగు విక్కట్లను నష్టపోయింది. ఆ తరువాత మరో రెండు వికెట్లను, 40 ఓవర్లకు ఆరు వికెట్లు.. 45 ఓవర్లకు అలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పొందగా, షమీ 37 పుగులిచ్చి రెండు విక్కట్లు, జెడేజా 42 పరుగుల్చి రెండు వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ధోణి సేన నిర్ణీత యాభై ఓవర్లలో 302 పరుగులు సాధించింది. తొలి ముఫై ఓవర్లలో తడబాటుకు గురైన ధోణిసేన ఆ తరువాత చివరి ఓవర్లలో కోలుకుని బంగ్లాదేశ్ బౌలర్లు ఉతికి ఆరేసింది. ముఖ్యంగా టీమిండియా స్కోరు బోర్డును రోహిత్ శర్మ, సురేష్ రైనాలు పరుగులు పెట్టించారు. 35 ఓవర్లు ధాటిన తరువాత ధాటిగా అఢిన రోహిత్ శర్మ, సురేష్ రైనాలు స్కోరుబోర్డును పరగులు పెట్టించి నాలుగో విక్కెట్ కు వంద పరుగుల ఫార్టనర్ షిప్ నమోదు చేశారు.  పూర్తి లైన్ అండ్ లెన్త్ లో వస్తున్న బందులను కూడా వీరిద్దరూ బౌండరీలకు తరలించారు. 126 బంతులను ఎదుర్కోన్న రోహిత్ ధాటిగా ఆడి.. 14 ఫోర్లు, మూడు సిక్స్ ల సాయంతో  137 పరుగులు సాధించాడు. అటు సురేష్ రైనా కూడా బంగ్లా బౌలర్లను చితకబాదాడు. 57 బంతులను ఎదుర్కోన్న రైనా.. 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 65 పరుగులను సాధించాడు. చివరి పది ఓవర్లలో భారత్ 97 పరుగులు సాధించింది. 15 ఓవర్లలో 150 పరుగులను సాధించింది.

ఓపెనర్ శిఖార్ ధావన్ 30 పరుగులు చేసి 16.3 ఓవర్లో 30 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలీయన్ చేరాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన అజ్యింక రహానే అచితూడి ఆడుతూ రోహిత్ శర్మతో కలసి నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యి వెనుదిరిగడంతో క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా ధాటిగా ఆడుతూ బంగ్లా బౌలర్లను కంగారు పెట్టించాడు. చివరిలో వచ్చిన జేడాజా కూడా ధాటిగా ఆడి కేవలం 8 బంతులలోనే ఒక్క పోరు సాయంతో 21 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 302 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ మూడు విక్కెట్లను చేజిక్కించుకోగా, మొర్తాజా, రుబెల్, షకీబ్ తలో వికెట్ సాధించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  bangaldesh  

Other Articles