newzeland | worldcup | finals

Newzeland beats southafrica in the semi finals of worldcup

southafrica, newzeland, worldcup, miller, de velliers, dumminey, macculam, finals, worldcup2015

New Zealand beat South Africa by four wickets in the semifinal of the ICC Cricket World Cup played at Eden Park in Auckland. Grant Elliott turned out to be New Zealand's saviour as he scored 84 off 73 balls to guide New Zealand to victory with 1 ball to spare.

పైనల్స్ లోకి న్యుజిలాండ్.. ఏడ్చేసిన సఫారీలు

Posted: 03/24/2015 06:37 PM IST
Newzeland beats southafrica in the semi finals of worldcup

నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతి దాకా ఏం జరుగుతుందా అని ఆతృత. అసలు సెమీ ఫైనల్ఖ మ్యాచా లేక ఇదే వరల్డ్ కప్ పైనల్ మ్యాచా అన్నతంలా సాగింది న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్. టికెట్టు తీసుకొని గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తూ అభిమానులు ఎంత ఎంజాయ్ చేశారో, టివీలకు అతుక్కుపోయిన వీక్షకులు కూడా అతే టెన్షన్, ఆనందాన్ని పొందారు. అసలు వరల్డ్ కప్ మజా అంటే ఇదే అన్న రీతిలో సాగిన పోరులో చివరికి సౌతాఫ్రికా ఇంటి ముఖం పట్టింది. ఇక న్యుజిలాండ్ ఆటగాళ్లు విజయాన్ని  బాగా ఎంజాయ్ చేశారు.

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లూ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు. ప్రపంచ కప్ సంగతి పక్కన బెట్టండి కనీసం ఫైనల్ వరకు కూడా వెళ్లలేదు. గతంలో కివీస్ ఆరుసార్లు, సఫారీలు మూడు సార్లు సెమీస్ చేరాయి.  ప్రపంచ కప్లో తొలిసారి ఫైనల్ చేరి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. అయితే ముందు నుండి ఆదిపత్యాన్ని సాగించిన సౌతాఫ్రికా మాత్రం కీలక మ్యాచ్ లో ఓడిపోయి తీవ్ర నిరాశకు గురైంది. దీంతో తొలిసారి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాలని ఆశించిన సౌతాఫ్రికాకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచ కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది.

 టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సఫారీ టీమ్ నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం కివీస్ కు 43 ఓవర్లలో 298 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 6 వికెట్లు కోల్పోయి లాస్ట్ బాల్ మిగిలి ఉండగా న్యుజిలాండ్ విజయం సాధించింది.  బ్రెండన్ మెకల్లమ్, ఓపెనర్లు గుప్తిల్ న్యుజిలాండ్ కు మంచి ఆరంభాన్నిచ్చారు.  36 బంతుల్లో 71 పరుగులు చేసి న్యుజిలాండ్ విజయానికి బాటలు వేశారు. కివీస్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న దశలో సౌతాఫ్రికా పేసర్ మోర్కెల్ బ్రేక్ వేశాడు. మోర్కెల్ వరుస ఓవర్లలో మెకల్లమ్, విలియమ్సన్ను అవుట్ చేశాడు. అయినా గుప్తిల్, రాస్ టేలర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కాగా గుప్తిల్ రనౌటయ్యాడు. కానీ న్యుజిలాండ్ వికెట్లను కోల్పోతున్నా, రన్ రేట్ మాత్రం తగ్గకుండా అదు ఉత్సాహంతో ముందుకు సాగింది. ఇల్లోట్ కొట్టిన సిక్స్ తో న్యుజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే గతంలో మూడుసార్లు సెమీస్లో బోల్తాపడిన సఫారీలు తాజా పోరులోనూ ఓటమి చవిచూశారు. స్టెయిన్ బౌలింగ్ లో ఇలియట్ సిక్సర్ సంధించగా కివీస్ విజయం ఖాయమైంది. అంతే సఫారీలు ఒక్కసారిగా ఓటమి బాధతో మైదానంలో్ ఏడ్చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : southafrica  newzeland  worldcup  miller  de velliers  dumminey  macculam  finals  worldcup2015  

Other Articles