భారత క్రికెట్ బోర్డులోకి జగ్ మోహన్ దాల్మియా తిరిగి రావడం పట్ల భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణాలతో క్రికెట్ బోర్డు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ జగ్ మెహన్ దాల్మియా తిరిగి అధికారానని చేపట్టంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీసీఐ సురక్షితులైన వ్యక్తి చేతుల్లో ఉందంటూ శుక్రవారం గంగూలీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణాలు, భారత ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇందులో భాగస్వాములవ్వడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని వివాదాల్లోకి నెట్టిన విషయాలను ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత దాల్మియా చాలా నాటకీయ పరిణామాల మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యారు.
జగ్ మోహన్ ధాల్మియాను చూసి తామెంతో గర్విస్తున్నామని చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడిగా లేకపోయినా ఆయనంటే తమకు గౌరవం, ప్రేమ ఉన్నాయన్నారు. భారత క్రికెట్ ను ఆయన మరింత ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షించారు. జగ్ మోహన్ దాల్మియా రాకతో టీమిండియా చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన దాల్మియా క్రికెట్ బోర్డును లభాల బాటలో నడిపించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more