ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమికి బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మే కారణమని నెటిజెన్లు ఆడిపోసుకున్నారు. అనుష్క మ్యాచ్ చూసేందుకు వెళ్లడం వల్లే విరాట్ కోహ్లీ విఫలమయ్యాడని, టీమిండియా ఓడిపోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేసి పాపం అనుష్కను ఏడిపించారు. తెలుగు అభిమానులయితే అనుష్కను ఐరన్ లెగ్ అనేశారు. అయితే వీటన్నింటినీ నిజం కాదని అమె రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్లే ఆప్ వెళ్లిందని అమె లక్కీ లేడి అని కోనియాడిన కొన్ని గంటల్లోనే అసలు వివాదం తెరమీదకు వచ్చింది. విరాట్ కు అనుష్క లక్కీ యేనా కాదా అన్నది తేలనుంది.
ఐపీఎల్లో బెంగళూరు మ్యాచ్‌లకు వర్షం నేనున్నానంటూ ప్రత్యక్షమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 187/5 భారీ స్కోరు చేసింది. బెంగళూరు లక్ష్యసాధనకు దిగగానే భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. ఐపీఎల్-8లో బెంగళూరు మొత్తం 16 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి నాకౌట్ చేరింది. బెంగళూరుకు ప్లే ఆఫ్ బెర్తు ఖాయంకాగానే కోహ్లీ సంతోషంతో తన ప్రేయసి అనుష్క దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అనుష్క కూడా ముసిముసి నవ్వులతో ప్రియుడిని అభినందించింది. దీంతో అనుష్క లక్కీ లేడి అని బెంగళూరు అభిమానులు మురిసిపోతున్నారు.
ఇంతవరకు బాగానే వున్నా.. అసలు వివాదం ఇక్కడే ప్రారంభమైంది. ఐపీఎల్ నియమనిబంధనలను కాదని విరాట్ కోహ్లీ అనుష్కను కలవడానికి విఐపీ గాలరీలోకి వెళ్లడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆదివారం ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్‌ను అనుష్క డ్రెస్సింగ్ రూం పక్కనున్న వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రూంకి వచ్చిన కోహ్లీ.. వర్షం పడుతున్న సమయంలో మ్యాచ్ అగిపోయిన సందర్భంలో అనుష్క శర్మను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఇద్దరు సుమారు ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ ఆటగాడు యువరాజ్ సింగ్ వారి పక్కనే ఉన్నాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మ్యాచ్ సమయంలో తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో తప్ప మరెవరితోను క్రికెటర్లు మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు అనుష్క శర్మను పిలిపించుకొని, మాట్లాడి.. ప్రియురాలి కోసం నిబంధలను అతిక్రమించాడు విరాట్ కోహ్లీ.
దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఐపీఎల్ అవినీతి నిరోధక సెక్యూరిటీ ప్రోటోకాల్ నుంచి తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నాడు. ఈ విషయంలో ఒకవేళ తనకు పిర్యాదు అందితే విరాట్ కోహ్లీకి నోటీసులు పంపుతామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని శుక్లా హెచ్చరించాడు. నియమనిబంధనలను ప్రతీ క్రికెటర్ పాటించాలని, లేని పక్షంలో వాటికి అర్థమేముంటుందని అయన అభిప్రాయపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more