మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ గౌతమ్ దాడికి గురైన నేపథ్యంలో.. ఆయనకు బంగ్లాదేశ్ పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సచిన్ వీరాభిమానిగా టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా గ్యాలరీలో సందడి చేసే సుధీర్ గౌతమ్‌పై బంగ్లాదేశీయులు దాడికి ఒడిగట్టారు. చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని.. ఒళ్లంతా త్రివర్ణ పతాకంలోని రంగులు వేసుకుని క్రికెటర్లను ఎంకరేజ్ చేసే సుధీర్‌పై బంగ్లాదేశ్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం అతనిపై అభిమానులు దాడికి దిగారు. సుధీర్‌పై దాడికి సంబంధించిన వార్త అన్నీ ఛానెళ్లలో ప్రసారం కావడమే కాకుండా.. అన్ని పత్రికల్లో ప్రచురితమైంది.
దీంతో, బంగ్లాదేశ్ పోలీసు అధికారులు అతనికి సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియంకు మంగళవారం సుధీర్ వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరు గార్డులు అతని వెంటే ఉండగా, మూడో వన్డే జరిగే రోజున సుధీర్‌కు నలుగురు గార్డులు కాపలా ఉంటారని బంగ్లా పోలీసు అధికారులు చెప్పారు. సుధీర్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌కు కూడా గట్టి భద్రతను కల్పించారు. ఇకపోతే.. ధోనీ మ్యాచ్ ఫీజులో కోత పడిన సంగతి తెలిసిందే. మైదానంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముఫ్తికార్ రెహ్మాన్‌ను తోసేయడంతో ధోనీ మ్యాచ్ ఫీజులో 75 శాతం పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more