టీమిండియా తరుపున వన్డే ఆటగాడిగా ఆడుతున్న అంబలి రాయుడు అటు తన సత్తా చాటుకుని టెస్టు జట్టులోకి కూడా ప్రవేశించేందుకు సన్నధమవుతున్నాడు. ఆయన నేతృత్వంలో టీమీండియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌లో భాగంగా కేరళలోని వాయనాడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఇరు జట్టు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. వాయనాడ్ జిల్లాలోని కృష్ణగిరిలో కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) సొంతంగా నిర్మించుకున్న స్టేడియంలో జరుగుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇదే.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అతిధ్య జట్టు దక్షిణాప్రికా.. నిలకడగా రాణిస్తుంది. తొలిరోజున మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా పలుమార్లు మ్యాచ్ కు అంతరాయం కలిగింది. భారత్ స్పిన్ర్ అక్సర్ పటేల్ స్పిన్ మాయాజాలం కూడా సఫారీల ముందు వెలవెలబోయింది. అతిధ్య జట్టు సభ్యులు నిలకడగా ఆగుతూ.. స్కోరుబోర్డును పరుగులెత్తంచారు. ఓపెనర్లు హెండ్రిక్స్, వాన్ జెల్ నెమ్మదిగా బాగస్వామ్యం నెలకొల్పతున్న సమయంలో 60 పరుగుల వద్ద తొలి విక్కెట్ దక్కింది. ఆ రువాత 100 పరుగులు స్కోరు వద్ద భారత్ ఖు మరో విక్కెట్ అభించింది. అర్థశతకం సాధించిన హెండ్రిక్స్ 50 పరుగలు వ్యక్తగత స్కోరువద్ద అవుట్ అయ్యాడు ఆ తరువాత 157 పరుగులకు అక్షర్ పటేల్ బౌలింగ్ లో డీ బ్రున్ పెవీలియన్ దారి పట్టాడు. రెండో రోజు భారత బౌలర్లు సత్తా చాటకపోతే భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా ఏ జట్టు దూసుకుపోవడం ఖాయమని తెలుస్తోంది.
భారత జట్టు వివరాలు: అంబటి రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, బైన్స్, శ్రేయస్ అయ్యర్, బాబా అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, మిథున్, శార్దుల్, ఈశ్వర్ పాండే, జాక్సన్, జీవన్‌జోత్ సింగ్
దక్షిణాఫ్రికా జట్టు వివరాలు: విలాస్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, బవుమా, క్లోట్, డి బ్రూన్, డి లాంజ్, రీజా హెం డ్రిక్స్, కేశవ్ మహరాజ్, ప్యాటర్సన్, పీడ్, రమేలా, సోట్సోబ్, వాన్ జిల్, విల్జోన్, వీస్, డి కాక్.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more