Glitzy cocktail for Harbhajan Singh and Geeta Basra

Harbhajan invites pm modi for his marriage

harbhajan singh, harbhajan singh invites modi, harbhajan singh marriage, harbhajan singh and geeta basra, harbhajan singh marriage, harbhajan singh geeta basra wedding, geeta basra actress, geeta basra and bhajji, geeta basra spotted, geeta basra to marry harbhajan singh

Cricketer Harbhajan Singh invites Prime Minister Narendra Modi for his marrage with geeta basra

ప్రధాని మోడీని తన పరిణయానికి ఆహ్వానించిన స్పిన్నర్

Posted: 10/10/2015 04:26 PM IST
Harbhajan invites pm modi for his marriage

టీమిండియా క్రికెటర్, స్పిన్ మాంత్రికుడిగా ఖ్యాతి గడించిన హర్భజన్ సింగ్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన పెళ్లికి తప్పక హాజరు కావాలంటూ వివాహ ఆహ్వాన పత్రికను అందించి, మోదీని ఆహ్వానించాడు. పంజాబ్ లోని జలంధర్ కు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ హోటల్ లో ఈ నెల 29న ఇండియన్ స్పీన్నర్ హర్భజన్ సింగ్.. తన చిన్ననాటి స్నేహితురాలు బాలీవుడ్ నటి గీతా బాస్రాను వివాహమాడనున్నారు. చిన్ననాటి బంధుం చిగురించి ప్రేమ బంధంగా మారింది.

అంతేకాదు పెళ్లీ బాజాక కూడా సిద్దమైన తరుణంలో ఆయన ప్రధాని సహా కేంద్రంలోని పలువురు పెద్దలను అహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ముందుగా ప్రధాని నరేంద్రమోడీకి తన వివాహ పత్రికను అందజేసి.. తన వివాహానికి తప్పకుండా రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్రధానితో కాసేపు అయన తన వివాహ విషయమై మాట్టాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫ్ ఇండియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది మొత్తం ఐదురోజులపాటు ఈ వివాహ తంతు జరగనుంది. నవంబర్‌ 1వ తేదీన ఢిల్లీలో రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గీత బస్రా లండన్‌లో ఉండగా.. ముంబైలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను డిజైన్‌ చేసి అక్కడికే పంపిస్తున్నట్లు తెలిసింది. వీరి వివాహానికి పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ, రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  geeta basra  marraige invitaion  pm narendra modi  

Other Articles