Virat Kohli's Birthday Turns Sour With Another Flop Show

Virat kohli s birthday turns sour with another flop show

Virat Kohli, Virat Kohli News, Virat Kohli birth day, Virat Kohli Birth day special, Virat Kohli flop show, Virat Kohli updates, Virat Kohli in southafrica

Virat Kohli, who turned 27 on Thursday, had a forgettable birthday as he fell cheaply in the first Test against South Africa in Mohali. The Indian skipper scored just one run after getting a leading edge off a Kagiso Rabada delivery. Dean Elgar took a low diving catch at short cover

విరాట్ కోహ్లీ గారి పుట్టిన రోజు ప్లాఫ్ షో

Posted: 11/05/2015 05:56 PM IST
Virat kohli s birthday turns sour with another flop show

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నాడు అభిమానులను నిరాశపరిచాడు. పుట్టిన రోజు బర్త్ డే ట్రీట్ ఇస్తాడని ఎంతగానో ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. ఇరవై ఏడు సంవత్సరంలోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ అభిమానులకు తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారని అనుకున్నా కానీ.. ప్లాఫ్ షో చూపించి.. ఫెవీలియన్ బాట పట్టారు. నిజానికి నేటి మ్యాచ్ మీద విరాట్ చేసిన వ్యాఖ్య లు కూడా అభిమానుల్లో ఆశలను మరింత పెంచాయి. రేపటి మ్యాచ్ మీద నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని.. రేపు ఫీల్డ్ లో దిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కానీ ఫీల్డ్ లో మాత్రం విరాట్ కోహ్లీ చెత్త పెర్ఫామెన్స్ తో అందరికి నిరాశను మిగిల్చారు.

నేటి మ్యాచ్ లో కేవలం నాలుగు బాల్స్ వరకు మాత్రమే నిలదొక్కుకొని ఒక్కటంటే.. ఒక్కటే పరుగు చేసి క్యాచ్ రూపంలో తన వికెట్ ను కోల్పోయారు. కనీసం క్రీజ్ లో కొంత సేపు మెరిసైనా అందరిని మురిపిస్తారని అనుకున్న అభిమానులకు అసంతృప్తే మిగిలింది. విరాట్ కోహ్లీ గురించి కపిల్ దేవ్ కూడా గతంలో పాజిటివ్ గా స్పందించారు. ఎవరి పర్ఫామెన్స్ వారిదే అని.. ధోనీకి, కోహ్లీకి పోలిక లేదని అన్నారు. అయితే కోహ్లీ మాత్రం చాలా కాలంగా పాంలోకి రావడం లేదు. గతంలో అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా కానీ పెద్దగా అభిమానులకు సంతృప్తి కలిగించేలా మాత్రం ఆడలేకపోయారు. తాజాగా పుట్టిన రోజు నాడు కూడా ఇలా నిరాశపరచడం అందరిని కలచివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles