new-zealand won by 7 wickets against srilanka in first one day

New zealand beat sri lanka in first test in dunedin

srilanka, New Zealand, chirst church, one day series, first one day, new zealand, new zealand cricket, cricket new zealand, new zealand vs sri lanka, sri lanka vs new zealand, nz vs sl, sl vs nz, brendon mccullum, cricket news, cricket

New Zealand bowling attack, without the services of Tim Southee and Trent Boult, bundled out Sri Lanka for 188 in first ODI.

లంకేయలు విలవిల.. తొలివన్డే కివీస్ వశం

Posted: 12/26/2015 07:17 PM IST
New zealand beat sri lanka in first test in dunedin

ఫార్మాట్ మారినా శ్రీలంక మళ్లీ పాత కథనే పునరావృతం చేసింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ శనివారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో లంకేయులు ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 47.0 ఓవర్లలో 188 పరుగులకే చాపచుట్టేసింది.శ్రీలంక ఆటగాళ్లలో సిరివర్ధనే(66), కులశేఖర(58)లు హాఫ్ సెంచరీలు మినహా ఎవరూ రాణించలేదు. ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో శ్రీలంక 189 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే కివీస్ ముందుంచింది. కివీస్ బౌలర్లలో హెన్రీ నాలుగు, బ్రాస్ వెల్ మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, మెక్ లారెన్ రెండు , మిల్నీకు ఒక వికెట్ లభించింది.

సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు గప్తిల్(79; 56 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), మెకల్లమ్(55;25 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్)లు శ్రీలంక బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలోనే జట్టు స్కోరు 108 పరుగుల వద్ద మెకల్లమ్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.  అనంతరం 162 పరుగుల వద్ద లాథమ్(18) రెండో వికెట్ గా అవుటయ్యాడు. మరో రెండు పరుగుల వ్యవధిలో గప్తిల్ పెవిలియన్ కు చేరినా అప్పటికే కివీస్ విజయం ఖాయమైంది. చివర్లో రాస్ టేలర్(5 నాటౌట్), నికోలస్(23 నాటౌట్)లు మిగతా పనిని పూర్తి చేయడంతో కివీస్ 21 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అంతకుముందు ఆతిథ్య శ్రీలంక 2-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్ ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilanka  New Zealand  chirst church  one day series  first one day  

Other Articles