Shahid Afridi quits as Pakistan T20 captain, coach Waqar too resigns

Waqar younis resigns as pakistan cricket coach

Icc world cup T20-2016, Shahid Afridi, T-20, Saharyar Khan, Waqar Younis, india, pakistan, Virat Kohli, Australia, Yuvraj Singh, Mahendra Singh Dhoni, ind vs pak, india vs pakistan, ind vs pak, pakistan vs india, pak vs ind, cricket

Facing criticism for Pakistan’s dismal show in the ICC World Twenty20, Shahid Afridi today stepped down as captain of the team and coach waqar too resigns.

కెప్టెన్ అఫ్రిదీ బాటలోనే జట్టు కోచ్ వకార్

Posted: 04/04/2016 07:49 PM IST
Waqar younis resigns as pakistan cricket coach

ఆసియా కప్ లో ఓటమి, ఆ తరువాత టీ 20 ప్రపంచ కప్ లోనూ పరాజయం.. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పలు కామెంట్లు.. ఆ తరువాత టీ 20 బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటనలు, ఆ తరువాత మళ్లీ కొంత సేపు డోలాయమానం ఇలా చకచక సాగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పినా.. జరగాల్సిన పరిణామలు మాత్రం జరగక తప్పలేదు, ఎట్టకేలకు పాకస్తాన్ టీ 20 కెప్టెన్ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నాడు పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది.

ఆసియా కప్ లోనూ, ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం,, జట్టు ఓటమికి ఆయనదే పూర్తి బాధ్యత అంటూ జట్టుకోచ్ వకార్ యూనస్ సహా పీసీబికి చెందిన మరో అధికారి కూడా అప్రీదికి వ్యతిరేకంగా నివేదికలు సమర్పించిన నేపథ్యంలో.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసివేయడానికి ముందే మేల్కోన్న అప్రీదీ తనకు తానుగానే ముందుగా తప్పుకుంటే తన మర్యాద, గౌరవానికి భంగం వాటిల్లదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే పొట్టి ఫార్మాట్‌లో ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ఆఫ్రిది తెలిపాడు. ‘టి20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నానని పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు తెలియజేస్తున్నానని ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో తన దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు జట్టులో చోటుపై ఆఫ్రిదికి ఎలాంటి హామీ ఇవ్వలేమని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ పునరుద్ఘాటించినప్పటికీ తాను ఆటగాడిగా కొనసాగుతానని అప్రీధి స్పష్టం చేశాడు.

కాగా, అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వకార్ యూనస్ ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా విషయాన్ని సోమవారం మీడియా ముందు వెల్లడించాడు. ' పాకిస్తాన్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా. నేను చాలా నిబద్దతతో గత 19 నెలలుగా పాకిస్తాన్ కోచ్గా పని చేశా.  వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కారణంగా చూపుతూ నన్ను బలిపశువును చేసేందుకు బోర్డు యత్నిస్తోంది.  నేను పాకిస్తాన్ క్రికెట్ కు చేసిన సేవను తక్కువగా చూపే ప్రయత్నం చేయొద్దు. మాజీ క్రికెటర్లకు ఇదే నా విన్నపం' అంటూ ఒకింత బాధగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Icc world cup T20-2016  Shahid Afridi  Waqar Younis  Saharyar Khan  pakistan  

Other Articles