ఐపీఎల్ పండగ వచ్చేసింది. దేశంతో పాటు విదేశాలలోని అనేక మంది అభిమానుల ఆదరాభిమానాలను చూరగోన్న ఇండియన్ ప్రిమియర్ లీగ్.. అభిమానులను సుమారుగా రెండు మాసాల పాటు తన సంబరాల్లో మునిగితేల్చనుంది, రాబోయే 51 రోజులు భారతదేశంలో మండిపోతున్న ఎండను మించిన వేడి. సాయంత్రం అయినా, రాత్రి 11 గంటల దాకా ఆ వేడి తగ్గదు. ఈ మధ్యలో ఇళ్లలో రిమోట్ కోసం యుద్ధాలు జరుగుతాయి. ప్రతి నిమిషం ఉత్కంఠ... ప్రతి రోజూ ఓ సరికొత్త పోరాటం... బౌండరీల మోతని... సిక్సర్ల హోరుని మోసుకుంటూ ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది.
నేడు ముంబై, పుణేల మధ్య వాంఖడే మైదానంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌కు తెరలేస్తుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో వెస్టిండీస్ క్రికెటర్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. ఆ ఉత్కంఠ క్షణాలను ఇంకా పూర్తిగా ఆస్వాదించనే లేదు. టి20 ప్రపంచకప్ ద్వారా భారతదేశం క్రికెట్ మజాను ఆస్వాదించి వారం కూడా గడవలేదు. ఈలోపే మరో సంరంభం వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఆనంద డోళికల్లో ముంచెత్తేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో మరో మెగా టోర్నమెంట్ వచ్చేసింది.
గత ఎనిమిదేళ్లుగా ప్రతి ఏటా వేసవిలో అంతులేని వినోదం. అయితే ఈసారి మాత్రం టోర్నీ కొంచెం కొత్తగా కనిపించబోతోంది. తొలి సీజన్ నుంచి టోర్నీలో సూపర్ స్టార్ హోదాలో చెన్నై జట్టు కెప్టెన్‌గా కనిపించిన ధోని... ఈసారి పుణే తరఫున ఆడబోతున్నాడు. గత ఏడాది ఆడిన చెన్నై, రాజస్తాన్‌ల బదులు ఈసారి పుణే, గుజరాత్ జట్లు రంగంలోకి దిగుతున్నాయి. ఇంతకాలం రామలక్ష్మణుల్లా కలిసి ప్రత్యర్థులపై యుద్ధం చేసిన ధోని, రైనా ఈసారి ప్రత్యర్థి జట్ల సారథులుగా తలపడబోతున్నారు. ఇక అభిమానులకూ ఈ వేసవి సాయంత్రాలు సమయం తెలియకుండా ముగిసిపోతాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more