Harbhajan Singh expresses his views on who could be next Indian coach

Harbhajan backs dravid for india coach job

Team india, Rahul Dravid, Zaheer khan, Indian Cricket coach, Harbhajan, Indian bowling coach, Ravi shastri, Ricky ponting

Harbhajan Singh said former captain Rahul Dravid is ideal to be the next chief coach of the Indian cricket team with Zaheer Khan as the bowling coach.

ఆ ఇద్దరే కోచ్ పదవికి అర్హులని తేల్చిన భజ్జి..

Posted: 05/22/2016 09:56 AM IST
Harbhajan backs dravid for india coach job

భారత బౌలింగ్ కోచ్ గా ఎవరు బాథ్యతలను నిర్వహిస్తే బాగుంటుందన్న అంశమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. టీమిండియా ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ను నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలోని ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా నియమించాలని పేర్కొన్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. ఇరువురి అనుభవంతో భారత క్రికెట్ జట్టుకు ఎంతో  లాభం జరుగుతుందనేది  తన వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని బజ్జీ స్పష్టం చేశాడు

కానీ విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరును రికమెండ్ చేశారు కదా అని ప్రశ్నించగా అతనికి కూడా కోచ్ గా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని బజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా  విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసలు కురిపించారు. కోహ్లి ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందచదగ్గ విషయమన్నాడు.  అతనిలో గెలవాలన్న తపన ముచ్చటగొలుపు తుందన్నాడు. ఇండియాలో జరుగుతున్న టీ20 మ్యచ్ ల వల్ల ప్రపంచ టీ20 కి ఇబ్బందులుంటాయనే వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఆర్సీబీలు ప్లే ఆఫ్ చేరుతాయని హర్భజన్ జోస్యం చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles