Chief selector Sandeep Patil applies for India's head coach post

India s chief selector sandeep patil applies for coach s job

india coach, india cricket team coach, india cricket team new coach, india new coach, team india new coach, sandeep patil selector, selector sandeep patil, cricket news, cricket

Sandeep Patil, the former India batsman and current chairman of selectors, has applied for the post of national head coach.

టీమిండియా కోచ్ పదవిలో మరో పేరు..

Posted: 06/04/2016 06:29 PM IST
India s chief selector sandeep patil applies for coach s job

టీమిండియా కోచ్ పదవికి బిసిసిఐ అహ్వానం పలకడంతో ఈ రేసులో చాలా పేర్లు వినిపించాయి. నిన్నటి వరకు టీమిండియా మేనజర్ గా వున్న రవిశాస్త్రీ, టీమిండియా ఏ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ద్రావిడ్, విక్రమ్ రాథోడ్, ప్రవీణ్ ఆమ్రే, లాల్ చంద్ రాజ్పుట్, రుషికేష్ కనిత్కర్ రేసులో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు బిసిసిఐ అధ్యక్షుడుతో వున్న సన్నిహిత్యం మేరకు మరో సంజయ్ బంగర్ పేరు కూడా వినిపించింది. ఈ జాబితాలో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ సందీప్ పాటిల్ ఈ పదవికి పోటీపడుతున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు పాటిల్ స్వయంగా చెప్పాడు.

2012 సెప్టెంబర్లో సెలెక్షన్ కమిటీ చైర్మన్గా పాటిల్ బాధ్యతలు చేపట్టాడు. నాలుగేళ్ల ఈ పదవీకాలం త్వరలో ముగియనుంది. టీమిండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్గా కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సమర్థవంతంగా పనిచేశాడని పేరుతెచ్చుకున్న పాటిల్.. కోచ్ పదవిని ఆశిస్తున్నాడు. కాగా కోచ్ పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు. పదవీకాలం పూర్తికావడంతో టీమిండియా డైరెక్టర్గా ఇటీవల వైదొలిగిన రవిశాస్త్రి కూడా పోటీపడవచ్చని క్రికెట్ వర్గాలు తెలిపాయి. టీమిండియా కోచ్ పదవికి మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ సహా పలువురి పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ఈ పదవికి బిసిసిఐ ఎవరిని ఎంపిక చేస్తారోన్నది వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles