బెయిల్ పై విడుదలైన శ్రీలంక క్రికెటర్.. Nuwan Kulasekara bailed after fatal motorcycle crash

Nuwan kulasekara bailed after fatal motorcycle crash

nuwan kulasekara, kulasekara, nuwan kulasekara car accident, nuwan kulasekara accident, sri lanka cricket, sri lanka news, cricket news, spors news, sports

Nuwan Kulasekara was on a highway when a motorcyclist travelling in the opposite direction hit a barrier and crashed into his vehicle.

బెయిల్ పై విడుదలైన శ్రీలంక క్రికెటర్..

Posted: 09/20/2016 05:56 PM IST
Nuwan kulasekara bailed after fatal motorcycle crash

రోడ్డు ప్రమాదం కేసులో ఒక వ్యక్తి మృతికి కారణమైన శ్రీలంక క్రికెటర్ నువాన్ కులశేఖరను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కొలంబోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కులశేఖర కారులో వెళుతూ ఒక ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కులశేఖరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే కులశేఖరకు బెయిల్ మంజూరు కావడంతో అరెస్టైన కాసేపటికే విడుదలయ్యాడు.

కొలంబోకు పది మైళ్ల దూరంలోని కదావాతా ఏ-1 హైవేపై కులశేఖర కారులో వెళుతుండగా అతనికి ఎదురుగా వస్తున్న మోటర్సైక్లిస్ట్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో తీవ్రగాయాలు పాలైన ఆ వాహన దారుడు అక్కడిక్కడే మృతిచెందాడు.  అయితే ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది శ్రీలంకలో రోడ్డు ప్రమాదాల వల్ల 2,700 మంది అసువులు బాసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఏ-1 హైపై ప్రమాదానికి గురై ప్రాణాలో కోల్పోయిన ద్విచక్రవాహన దారులు సంఖ్య సగానికి పైగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nuwan Kulasekara  srilanka  arrest  bailed  cricketer  fatal car crash  

Other Articles