టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల రానురాను అంతరం పెరుగుతుందన్న కథనాలకు కొదవేమీ లేదు, అసలు వీరిద్దరికీ పొసగడం లేదని, కుంబ్లే రావడంతోనే నెట్స్ లో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లీ దూరంగా ఆట ముగించుకుని వెళ్లిపోతున్నాడని కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగడానికి కారణం ఏంటన్న కోణంలో అనేక కథలు, కథనాలు వినబడుతున్నాయి. వీరిద్దరిని టార్గెట్ చేసుకుని రోజుకొక కొత్త వివాదం తెర మీదకు వస్తోంది.
తాజాగా జట్టుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాలో ఉన్న తన మిత్రులకు కుంబ్లే లీక్ చేస్తున్నాడంటూ కొత్త రూమర్ ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించి డీఎన్ఏ వార్తాపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మీడియాలో తనకు నమ్మకమైన స్నేహితులతో ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన అనీల్ కుంబ్లే.. జట్టుతో పాటు రహస్యంగా వుంచాల్సిన పలు విషయాలను మీడియా మిత్రులకు లీక్ చేస్తున్నాడన్న కథనం తీవ్ర కలకలం రేపుతుంది. వాట్సాప్ గ్రూపు ద్వారా జట్టుకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నాడని సదరు పత్రిక కథనంలో పేర్కోంది.
అంతేకాదు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పటి సమాచారాన్ని కూడా వాట్సాప్ లో పంపుతున్నాడని పేర్కొంది. ఈ మేరకు బీసిసిఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారని కూడా పేర్కోంది. ఈ నేపథ్యంలో కుంబ్లే, కోహ్లీల మధ్య అగాధం మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కోచ్ గా కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో, కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త కోచ్ ను ఎంపిక చేయనుంది. ఈ పదవికి ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ దాఖలు చేసుకోగా టామ్ మూడీ కూడా బరిలో నిలిచేందుకు అసక్తి చూపుతున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more