భారత క్రికెటర్ ఛతేశ్వర పుజారా టిమిండియా నయా వాల్ గా అవతరించాడు. ఈ క్రమంలో ఆయన అరుదైన ఘనతకు చేరువయ్యాడు. 3 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొలంబోలో ఆగస్టు 3 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టు పుజారాకి 50వది కావడం విశేషం. ఇరు జట్ల మధ్య గాలెలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతంగా ఆడి 153 పరుగులు సాధించాడు. ఈ టెస్టులో భారత్ ఆతిథ్య లంకపై 304 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
తన ఆటతీరు వివరించడంలో తన తండ్రే తనకు మంచి విమర్శకుడని చెప్పాడు. ఆట పట్ల అతను ఎంతో అంకిత భావం కలవాడని కొన్నిసార్లు తన పట్ల కఠినంగా వ్యవహరించేవాడని కూడా చెప్పాడు. అప్పుడు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించేవాడో అర్థమయ్యేది కాదని.. అయితే అది ఇప్పుడు అర్థమౌతోందని వివరించాడు. దేశం తరఫున త్వరలో 50వ టెస్టు ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగానూ ఉందన్నాడు. తన ఈ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నానని చెప్పాడు.
తన అటలో రాణించడం కష్టంగా మారిన సమయంలో కొన్ని మార్పులు చేసుకుని ఆటతీరును మార్చుకున్నానని చెప్పాడు. అయితే ఈ విషయమై దివాల్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించానని, కాగా అతను నా బ్యాటింగ్ శైలిని అలాగే కొనసాగించమని సలహా ఇచ్చాడని చెప్పాడు. ఆటపై పట్టు సాధించడం ద్వారా.. రాణించడం సులువవుతుందని కూడా సూచించాడని పూజారా చెప్పాడు. ఆట కోసం కష్టపడటం సచిన్, ద్రవిడ్ నుంచే నేర్చుకున్నానని యువ ఆటగాళ్లకు వారు ఎంతో స్ఫూర్తినిస్తారని పుజారా తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more