టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అరుదైన గౌరవం లభించింది. టీమిండియాకు అడుతున్న క్రమంలో తాను అధికారికంగా వీడ్కోలు పలికేందుకు ఓ మ్యాచులో తీసుకోవాలని ఆయన కోరినా.. తన అభ్యర్థనను తిరస్కరించిన బిసిసిఐ ఇన్నాళ్లకు తప్పు తెలుసుకుంది. టీమిండియా జట్టు విజయం ఆయన చేసిన పరుగులు సాధించిన రికార్డులను లేటుగా పరిశీలించి మేల్కోన్న బిసీసీఐ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
తన నేతృత్వంలో నడిచే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ గేట్ కు సెహ్వాగ్ పేరు పెట్టింది. ఇవాళ ఈ గేట్‌ను ప్రారంభించారు. బుధవారం ఈ స్టేడియంలోనే ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనున్న క్రమంలో ఈ గేట్ ఇలా నామకరణం చేశారు. చిన్నప్పుడు తాను క్రికెట్ నేర్చుకున్న స్టేడియంలో గేట్ కు తన పేరు పెట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీతోపాటు జట్టు సభ్యులందరూ హాజరై సెహ్వాగ్ కు శుభాకాంక్షలు చెప్పారు.
Head Coach @RaviShastriOfc and #TeamIndia members congratulate @virendersehwag after the gate at Feroz Shah Kotla was named after him. pic.twitter.com/bveVvQtUrP
— BCCI (@BCCI) October 31, 2017
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more