క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీల తరువాత తాజాగా మరో మాజీ దిగ్గజ అటగాడు వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ అంబుడ్స్ మన్ నుంచి తాఖీదులు అందాయి. బిసిసిఐ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నుంచీ ఈ దిగ్గజ త్రయానికి నోటీసులు జారీ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ మెంటార్ గా రెండు లాభదాయకమైప పదవులను అనుభవిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 28 లోగా నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని నోటీసులో కోరారు.
సచిన్ టెండుల్కర్ కు నోటీసులు జారీ చేసే ముందుగానే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలికి కూడా ఆయన ఈ మేకు నోటీసులు జారీ చేశారు. క్యామ్ అధ్యక్షుడిగా, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలతో కూడా జతకట్టినట్టుగా వస్తున్న వార్తలపై సమాధానం చెప్పాలని గంగూలీకి అంబుడ్స్ మెన్ నోటీసులు జారీ చేశారు. కాగా తాజాగా హైదరాబాదీ అటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కు కూడా ఆయన నోటీసులు జారీ చేశారు.
లక్ష్మణ్ కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కోనసాగుతూ.. అటు సన్ రైజర్స్ హైదరబాబ్ జట్టుకు కూడా అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురికి జారీ చేసిన నోటీసులపై నిర్ణీత గడువులోగా స్పందించాలని పేర్కోన్నారు. లేనిపక్షంలో... ఆ తర్వాత వివరణ ఇచ్చేందుకు అవకాశం ఉండబోదని చెప్పారు. నోటీసుకు సంబంధించిన ఒక కాపీని బీసీసీఐకి కూడా పంపించారు. అయితే ఈ త్రయం బిసిసిఐతో ఒకటికి మించిన లాభదాయక పదవులను అనుభవిస్తున్నారని మధ్యప్రదేశ్ కు చెందిన సంజీవ్ గుప్తా అనే క్రికెటర్ పిర్యాదు నమోదు చేసిన నేపథ్యంలో అంబుడ్స్ మెన్ ఈ మేరకు దిగ్గజ ఆటగాళ్లకు నోటీసులు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more