ఫిఫా వరల్ఢ్ కప్ కి ముందు గత వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన స్పెయిన్ ఈ సారి కూడా కప్ గెలుస్తుందని అంతా అంచనా వేశారు. ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కనీసం నాకౌట్ దశకు కూడా చేరుకోలేక పోయింది. సముద్రపు జీవుల జోస్యాలు, జంతుల జోస్యాలు ఏవీ నిజం కాలేదు. నిన్నటికి నిన్న ఛిలీ, స్పెయిన్ మ్యాచ్ కి ముందు ఒంటె స్పెయిన్ గెలుస్తుందని చెప్పింది. కానీ తీరా ఫలితం తారు మారు అయ్యింది. దానికి తోడు ఈ వరల్డ్ కప్ లో కూడా చరిత్ర పునరావృతం అయ్యింది.
ఇంత వరకు డింపెండ్ ఛాపింయన్ నాకౌట్ చేరిన సందర్భాలు లేవు. ఇప్పుడు అదే జరిగింది. తొలి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఘోర పరాజయం పాలైన స్పెయిన్ రెండో మ్యాచ్ లోనైనా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ చిలీతో జరిగిన మ్యాచ్ లో 2-0 తేడాతో ఓడి ఇంటి ముఖం పట్టింది. స్పెయిన్ పై విజయంతో చిలీ నాకౌట్ దశకు చేరుకొని ఔరా అనిపించుకుంది. నిన్న హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో సాగిన మ్యాచ్ లో తొలి అర్ధ భాగంలోనే రెండు గోల్స్ సాధించి చిలీ ఆధిక్యాన్ని సంపాదించుకుంది.
20వ నిమిషంలో వర్గాన్ తొలి గోల్ సాధించగా, 43 వ నిమిషంలో అరాన్ గెజ్ మరో అద్భుతమైన గోల్ సాధించిచాడు. రెండో భాగంలో స్పెయిన్ గోల్ కోసం ప్రయత్నాలు చేసినా చిలీ ఆటగాళ్ళు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో స్పెయిన్ కథ కంచికి చేరింది. మరి ఇప్పటికైనా ఈ జంతువుల జోస్యాలు , జట్ల గెలులు ఓటముల పై చెప్పడం మానేస్తే ఈ మూఢ నమ్మకాలను ఫుల్ బాల్ అభిమానులు నమ్మకుండా ఉంటారు, బెట్టింగులు పెట్టేవారు పెట్టరు.
Knr
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more