ఇంతవరకు ఫిఫా వరల్డ్ కప్ 2014లో ఒక దశ ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా సాగిన ఈ ఫుట్ బాల్ పోరాటంలో కొన్ని జట్లు సంచలనాల విజయాలను సాధించగా... అగ్రజట్లు సులువుగా తమ గమ్యస్థానానికి చేరుకున్నాయి. స్టార్ ప్లేయర్లు కూడా ఇబ్బందుల్లో వున్న తమ జట్టును కాపాడుకుంటూ విజయాలబాటవైపు తీసుకెళ్లారు. కొత్తగా వచ్చిన ప్లేయర్లు కంటే.. మునుపటి స్టార్ ప్లేయర్లే అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఇలా ఈ విధంగా రకరకాల సంచలనాలకు వేదికగా నిలిచిన ఈ సాకర్ ప్రపంచకప్ చివరకు గ్రూప్ దశకు చేరుకుంది.
శనివారం నాడు నుంచే మొదలయ్యే ఈ నాకౌట్ దశలో వున్న జట్లన్నీ చావోరేవో అన్నట్టు తమ ప్రతిభను ప్రదర్శించుకోవాల్సిందే! ‘‘డ్రా’’ అనే ప్రస్తావనే లేకుండా ప్రతిఒక్క జట్టు లక్ష్యానికి చేరుకోవాల్సిన పరిస్థితి. 90 నిముషాల వరకు జరిగే ఈ మ్యాచ్ లో ఫలితం వెలువడకపోతే... తిరిగి 30 నిముషాలవరకు ఆటను పొడిగిస్తారు. ఇక అప్పటికీ ఫలితం తేలకుంటే షూటౌట్ విధానం... చివరికి అందులోనూ ఫలితాలు రాకపోతే సడెన్ డెత్! పదహారు జట్ల మధ్య జరిగే ఈ రసవత్తమైన పోరాటంలో ముందుకెళ్లే 8 జట్లు ఏవో త్వరలోనే తేలిపోతుంది.
తొలిరోజు అయిన శనివారంనాడు నాలుగు జట్లు ఒకేసారి తలపడనున్నాయి. ఇందులో బ్రెజిల్ (దక్షిణ అమెరికా) జట్టు చిలీతో తలపడనుండగా... స్టార్ ఆటగాడు సురెజ్ ను కోల్పోయిన ఉరుగ్వే, గ్రూప్-సిలో టాపర్ అయిన కొలంబియాతో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లను తిలకించడానికి బ్రెజిల్ లో అభిమానులు లక్షలాది మంది తరలివస్తున్నారు. అందరి మదిలో అలజడులు అప్పుడే మొదలయ్యాయి. ఎవరు, ఎలా, ఏ జట్టు గెలుస్తుందోనన్న ఉత్కంఠభరితమైన టెన్షన్స్ లో మునిగిపోయారు.
తొలిరోజులో పోరాడే ఈ నాలుగు జట్లు సమానమైన బలాబలాలను కలిగి వున్నవే! రికార్డులను సృష్టించడంలో ఉరుగ్వే జట్టుది పై స్థానం అయితే... ఆ జట్టుతో తలపడనున్న కొలంబియా గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శనతో మూడు మ్యాచుల్లోనూ విజయాలను సాధించి అందరినీ ఆకట్టుకుకంది. తొలి మ్యాచ్ లోనే ఓటమి చవిచూసిన ఉరుగ్వే.. ఆ తరువాత సంచలనాత్మకమైన రికార్డులను సృష్టించుకుంటూ రెండు మ్యాచుల్లో నెగ్గింది. అయితే వీరి జట్టులో స్టార్ ఆటగాడు అయిన సురెజ్... అతిగా ప్రవర్తించడం వల్ల జట్టునుంచి వైదొలగిపోయాడు. ఇప్పుడు ఈ జట్టు కొలంబియాతో ఎలా గెలవనుందో త్వరలోనే తేలిపోనుంది. ఇక కొలంబియా జట్టుకు యువక్రీడాకారుడైన రోడ్రిగెజ్ ఒక పెద్ద బలం.
ఇక బ్రెజిల్, చిలీ జట్లు కూడా అంత సామాన్యమైనవి కావు. రెండు విజయాలు, ఒక డ్రాతో సులభంగా నాకౌట్ కు చేరిపోయిన బ్రెజిల్.. గ్రూప్ దశలో మాత్రం అంతగా ప్రదర్శన చూపించలేకపోయింది. అయితే అందులో ప్రదర్శించిన వ్యూహాత్మక అభిప్రాయం అందిరినీ ఆశ్చర్యచికితుల్ని చేసేసింది. మరోవైపు స్పెయిన్ వంటి దిగ్గజ జట్టును సైతం పెద్ద షాక్ కు గురిచేసి విజయాన్ని అందుకున్న చిలీ జట్టు కూడా చాలా ప్రమాదమైంది. గతంలో చిలీతో 68సార్లు తలపడిన బ్రెజిల్ కేవలం 8సార్లు మాత్రమే ఓడిపోయినా.. ప్రస్తుతం చిలీ జట్టు ప్రదర్శించిన ఫామ్ ప్రకారం దానిని అంత తేలికగా తీసి పారెయ్యలేం. ఏదేమైనా బ్రెజిల్ ఈసారి పూర్తిస్థాయిలో తన ప్రతిభను ప్రదర్శిస్తేనే గెలుస్తుందని అందరూ భావించుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more