ప్రపంచ కప్ గెలవడమే కాకుండా, అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ హోదా దక్కించుకున్న తరువాత అదే ఊపులో మూడేళ్ల క్రితం ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన టీం ఇండియాకి రెండు నెలల పాటు కఠిన పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో ఒక్కసారి కూడా నెగ్గకుండా ఘోర పరాభవంతో స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలు వారి మదిలో ఇంకా మిగిలే ఉన్నాయి.
ఇదంతా మూడేళ్ల క్రితం ఇంగ్లాండ్ లో జరిగిన సిరీస్ గురించే. ఆడిన అన్ని ఫార్మాట్లో ఓడిపోయి నెంబవన్ స్థానాన్ని, పరువు పోగొట్టుకొని ఏకంగా ఆటగాళ్ళు కెరీర్ కే ముప్పు తెచ్చుకున్నారు. ఆ పర్యటనలో విఫలం అయిన సీనియర్లంతా ఇప్పుడు జట్టులో లేరు అంతా యువ రక్తం నిండిన ఆటగాళ్ళే కానీ ఆ గడ్డ పై అనుభవం ఉన్నవారు మాత్రం కొద్ది మందే ఉన్నారు. గడిచిన మూడేళ్ళలో ఇండియా జట్టులో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.
అప్పటి దిగ్గజాలు అందరు జట్టును వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు కోహ్లీ, రహానె, పుజారా వంటి వాళ్లతో ఆ గడ్డ పై రేపటి నుండి రెండు నెలల పాటు టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఢీ కొనబోతుంది. మరి ఈసారైన ప్రత్యర్థుల్ని దెబ్బతీసి వారి పై ప్రతీకారం తీర్చుకుంటారో లేక మళ్ళీ చితికిల పడతారో చూడలి. ఇక మూడేళ్ళ క్రితం గట్టి దెబ్బకొట్టిన ఇంగ్లాండ్ పరిస్థితి ఈసారి అంతం మాత్రంగానే ఉంది. ఆ జట్టులో స్టార్ ఆటగాళ్ళయిన స్ట్రాస్, పీటర్సన్, స్వాన్ లాంటి వారు జట్టుకు దూరం అయ్యారు.
కొత్త కుర్రాళ్ళు జట్టులోకి వచ్చినా ఇంకా పూర్తి నైపుణ్యం సాధించలేదు. యాషెస్ సిరీస్ నుండి అంతంత మాత్రమే ప్రదర్శన చేస్తున్న ఇంగ్లాండ్ ను ఈసారి దెబ్బ కొట్టడానికి ఇండియాకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. రేటి నుండి నాటింగ్ హామ్ లో జరిగే మొదటి టెస్టుతో మనవాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందో తెలిసిపోనుంది.
Knr
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more