Indian shutler saina nehwal requested badminton association of india to send her new coach vimal kumar to koria asia games

saina nehwal, saina nehwal latest news, saina nehwal new coach, saina nehwal vimal kumar, shutler coach vimal kumar, vimal kumar latest news, pullala gopichand news, koria asia games, aisa games 2014

Indian shutler saina nehwal requested badminton association of india to send her new coach vimal kumar to koria asia games

కోచ్ కోసం ఆరాటపడుతున్న సైనా నెహ్వాల్!

Posted: 09/10/2014 06:28 PM IST
Indian shutler saina nehwal requested badminton association of india to send her new coach vimal kumar to koria asia games

గురుశిష్యులకు అతీతంగా నిలిచిన ప్రముఖ బారత షట్లర్ సైనా నెహ్వాల్, కోచ్ పుల్లల గోపీచంద్ లు కొన్ని విభేదాల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో ఈ అమ్మడికి విమల్ కుమార్ ను కొత్త కోచ్ గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నియమించింది. అయితే ఈయన ఆమెకు ఎలా పాఠాలు నేర్పుతున్నాడో ఏమో గానీ.. ఇప్పుడు ఆమె తన కోచ్ కోసం ఆరాటం పడుతున్నట్లు తెలుస్తోంది.

కొరియాలో జరగనున్న ఆసియా క్రీడలకు వెళ్లే కోచ్ ల జాబితాలో తన కొత్త కోచ్ విమల్ కుమార్ పేరును కూడా చేర్చాలంటూ ఆమె బీఏఐను కోరింది. అక్కడ కూడా తాను తన ఆటకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటే బాగుటుందని భావించిన సైనా.. ఈ విధంగా బీఏఐకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర సైనా కేవలం గత కొన్నిరోజుల నుంచి మాత్రమే శిక్షణ తీసుకుంటోంది. అంటే.. వీరిద్దరూ ఇంకా పూర్తిగా గురు-శిష్యురాలిగా లీనమైపోలేదన్న భానవతో వున్నట్లు చెబుతున్నారు. మునుపటి కోల్ లాగా తమ మధ్య ఇంకా సాన్నిహిత్య బంధం ఏర్పడలేదని ఆలోచనతో ఈ అమ్మడు తనతోపాటు ఆసియా క్రీడలకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అలాగే ఈసారి జరగబోయే ఆ క్రీడల్లో తాను ఎట్టిపరిస్థితుల్లోనూ టైటిల్ సొంతం చేసుకోవాలనే కసిగా వున్నట్లు తెలుపుతోంది. అందుకు తాను తన శాయశక్తులా ప్రయత్నిస్తానని వెల్లడిస్తోంది సైనా! ఈ నేపథ్యంలోనే తనకు తన కోచ్ సహకారం కావాలని.. అందుకే ఆయనను తనతోపాటు కొరియాకు తీసుకెళ్లే పునరాలోచన బాగంగా దరఖాస్తు చేసుకుంది. అటు సైనా నుంచి తమకు విజ్ఞప్తి అందిందని.. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీఏఐ సీనియర్ అధికారి వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles