Saina drops to World No 2 in womens singles ranking | BWF Rankings

Saina drops to world no 2 in womens singles ranking

saina nehwal news, saina nehwal rank, saina nehwal latest updates, saina skips singapore tournament, BWF rankings, indian badminton players, gutta jwala news, ashwini ponnappa, pv sindhu news, parupalli kashyap

Saina drops to World No 2 in womens singles ranking : After reaching a career-high of World No. 1 in women's singles, Saina Nehwal dropped to No. 2 in the revised Badminton World Federation (BWF) rankings on Thursday as reigning Olympic champion Li Xuerui re-took the top spot.

దిగజారిపోయిన సైనా నెహ్వాల్..

Posted: 04/09/2015 03:53 PM IST
Saina drops to world no 2 in womens singles ranking

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇటీవలే మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుని సంచలన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే! ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్ గత నెలలో ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లో ఒటమి పాలవ్వడంతో సైనా నెహ్వాల్ ఆ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగలిగింది. అంతేకాదు.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సిరీస్ లో ఫైనల్ కి చేరిన తొలి భారతీయ మహిళగా ఈమె రికార్డు నమోదు చేసింది. అలాగే ఇండియా ఓపెన్ టైటిల్ ని గెలుచుకోగలిగింది. దీంతో ఈమె మొదటి ర్యాంకును పొందింది. దీంతో ఆ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు స్థాపించింది.

అయితే.. ఈ రికార్డు ఎన్నోరోజుల వరకు నిలవలేదు. తాజాగా ఈ అమ్మడు రెండో స్థానానికి దిగజారిపోయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ((బీడబ్ల్యూఎఫ్) అధికారికంగా ప్రకటించింది. మియామీ ఓపెన్ సిరీస్ లో భాగంగా సెమీ ఫైనల్ లో ఒలంపిక్ ఛాంపియన్ చైనా క్రీడాకారిణి లీ ఝౌరీ చేతిలో సైనా నెహ్వాల్ ఓడిపోయిన సంగతి విదితమే! ఆ ఓటమితోనే సైనా నెహ్వాల్ 2 ర్యాంకుకు చేరింది. ఇక తాజాగా సింగపూర్ ఓపెన్ లో పాల్గొనకుండా సైనా విరామం తీసుకుంది. సైనా నెహ్వాల్ ఒక్కసారిగా ఇలా 2 ర్యాంకుకు దిగజారిపోవడంతో ఇండియన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. గురువారం (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన ర్యాంకుల్లో పురుషుల సింగిల్స్ స్పెషలిస్ట్ తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ 4 పొజిషన్లో ఉన్నారు. ప్రణయ్ 14వ ర్యాంకులో, రెండు ర్యాంకులు మెరుగు పర్చుకున్న పారుపల్లి కాశ్యప్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్ప జోడికి 18వ ర్యాంకు దక్కింది. కాగా పురుషుల డబుల్స్లో టాప్-25 ర్యాంకుల్లో భారతీయ క్రీడాకారులెవరికీ చోటుదక్కలేదు. గాయంతో బాధపడుతున్న మరో క్రీడాకారిణి పివి సింధు 9వ ర్యాంకులో కొనసాగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal News  BWF Rankings  Pv Sindhu News  Gutta Jwala News  

Other Articles